Telugu News Spiritual Yogini Ekadashi 2025: must chant these Tulsi mantra on Yogini ekadashi for money benefit in telugu
Yogini Ekadashi 2025: యోగిని ఏకాదశి రోజున ఈ పని చేస్తే చాలు.. తులసి అనుగ్రహంతో ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి..
హిందూ మతంలో తులసి మొక్కకు పవిత్రమైన మొక్కగా భావించి పుజిస్తారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో ఆనందం ఉంటుంది. ఎవరి ఇంట్లోనైనా కూడా డబ్బు కొరత ఉండి.. ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే యోగిని ఏకాదశి రోజున చేసే చిన్న చర్యలతో లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం. ఏకాదశి రోజు సాయంత్రం ఏ పరిహారం ఫలవంతం అవుతుందంటే..
మత విశ్వాసం ప్రకారం, బిల్వపత్రం, గంగాజలం, తామరతో పాటు తులసి ఆకులు కూడా ఎప్పుడూ పాతబడవు. మీరు పూజలో పాత తులసి ఆకులను కూడా ఉపయోగించవచ్చు. తులసి ఆకులను కూడా శుద్ధి చేసి మళ్లీ మళ్లీ పూజకోసం వినియోగించవచ్చు. విష్ణుపూజలో తులసి తప్పనిసరి...కొత్త ఆకులు దొరికితే పర్వాలేదు లేదంటే వాడిన ఆకులు ఉన్నా పూజలో వాడొచ్చు అంటున్నారు. మీరు దేవుళ్లకు ఉపయోగించిన తులసిని పడవేయాలంటే..పారే నీటిలో పోయాలని చెబుతున్నారు. శుభ్రమైన ప్రదేశంలో వేయాలని చెబుతున్నారు.
హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. తులసిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. తులసి మొక్కను విష్ణువుకు ప్రియమైనదిగా భావిస్తారు. అదే సమయంలో ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో యోగిని ఏకాదశి రోజున ఒక చిన్న పని చేస్తే.. పేదరికం మీ ఇంటి గడప కూడా తొక్కదు. ఇంట్లో డబ్బు కొరత ఉంటే ఈ యోగిని ఏకాదశి రోజున చేసే ఒక సాధారణ పనితో డబ్బు ఇబ్బందులు తీరతాయి.
ఈ సంవత్సరం యోగిని ఏకాదశి వ్రతం జూన్ 21న జరుపుకోనున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం యోగిని ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం కూడా చాలా పవిత్రమైనది. ఏకాదశి నాడు సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించి, తులసికి సంబంధించిన నామాలను జపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా.. కోరికలు నెరవేరడమే కాదు ఇంట్లో సంపద సమృద్ధిగా ఉంటుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.