World Environment Day 2023: ప్రతి సంవత్సరం జూన్ 05ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023గా జరుపుకుంటారు. చెట్లు, మొక్కల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చెట్లు, మొక్కలు లేకుండా జీవి మనుగడ అసాధ్యం. అయితే చెట్లు, మొక్కలు పర్యావరణం, ప్రకృతి పరంగానే కాకుండా సైన్స్, జ్యోతిష్య పరంగా కూడా ముఖ్యమైనవిగా పరిగణించబడుతుంది. సనాతన ధర్మంలో చెట్లు, మొక్కలకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఇక వందల ఏళ్లుగా చెట్లు, మొక్కలను పూజించడం హిందూమతంలో ఆచారంగా వస్తున్న విషయం తెలిసిందే.
జ్యోతిష్యం పరంగా చూసుకుంటే.. గ్రహాలు, నక్షత్రరాశులతో చెట్లు, మొక్కలకు సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు. రాశిచక్రం (రాశిచక్రం) ప్రకారం మొక్కలు నాటడం వలన గ్రహాల ప్రభావం సానుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు పండితులు. జీవితంలో గ్రహ పరిస్థితులు అనుకూలంగా ఉండాలని, శుభ ఫలాలు పొందాలని కోరుకుంటే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 నాడు ఖచ్చితంగా రాశి ప్రకారం చెట్లు, మొక్కలు నాటితే మేలు జరుగుతుందంటున్నారు. ఏ రాశి వారు ఏయే చెట్లు, మొక్కలు నాటడం వల్ల లాభం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మేషం: వీరు ఎరుపు రంగు పువ్వులు, పండ్ల వచ్చే చెట్లు, మొక్కలను నాటవచ్చు. అలాగే ఒక వేప చెట్టును నాటడం కూడా మేలు చేస్తుంది.
వృషభం: ఈ రాశి వారు పర్యావరణ దినోత్సవం రోజున తెల్లటి పూలు పూసే మొక్కలను నాటవచ్చు. ఇది ఆర్థిక ప్రగతికి దారి తీస్తుంది.
మిథునం: ఈ రాశి వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున తులసి, వెదురు మొక్కలు నాటొచ్చు. దీంతో చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చంద్రుని ఆశీస్సులు పొందడానికి వేప, తులసి, మునగ మొదలైన వాటిని నాటవచ్చు.
సింహ రాశి: ఈ రాశి వారు సూర్యభగవానుని ఆశీర్వాదం పొందడానికి ఎర్రటి పువ్వులు పూసే చెట్లను నాటాలి.
కన్య: వీరు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున రోజ్‌వుడ్, వెదురు, తులసి వంటి మొక్కలను నాటండి. ఇది అదృష్టాన్ని పెంచుతుంది.
తులారాశి : తులారాశి వారు పలాశ మొక్కను నాటొచ్చు. దీని వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అలాగే, అర్జున, నాగేకేసర మొక్కలను కూడా పెంచొచ్చు.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఆర్థిక స్థితి బలపడాలంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఎరుపు రంగు పూలు, పండ్ల కాసే మొక్కలను నాటాలి.
ధనుస్సు: ఈ రాశి వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున పసుపు పూలు పూసే మొక్కలు నాటాలి. మొలశ్రీ, చిర్, సలాల్ చెట్లను నాటడం శుభదాయకం.
మకరం: నలుపు, నీలం పువ్వులు పూసే చెట్లను, మొక్కలను నాటాలి. శమీ, చెరుకు చెట్లను నాటడం కూడా చాలా శుభప్రదం.
కుంభం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున శని భగవానుడి ఆశీర్వాదం పొందడానికి నీలిరంగు పూల మొక్కలు, ప్రత్యేకంగా శమీ మొక్కలను నాటవచ్చు.
మీనం: ఈ రాశి వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మామిడి మొక్కలు నాటాలి. దీంతో జాతక దోషాలన్నీ తొలగిపోతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..