కొమురవెల్లి మల్లన్న దర్శనానికి మహిళా అఘోరి.. ఆశ్చర్యానికి గురైన భక్తులు

| Edited By: Janardhan Veluru

Sep 09, 2024 | 4:41 PM

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెళ్లిలో మల్లికార్జునస్వామిని ఒక మహిళా అఘోరి దర్శనం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పురుష అఘోరాలు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్లేవారు. కానీ ఇటీవల ఓ మహిళ అఘోరి ధిగంబర రూపంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడంతో.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కొమురవెల్లి మల్లన్న దర్శనానికి మహిళా అఘోరి.. ఆశ్చర్యానికి గురైన భక్తులు
Woman Aghori
Follow us on

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెళ్లిలో మల్లికార్జునస్వామిని ఒక మహిళా అఘోరి దర్శనం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పురుష అఘోరాలు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్లేవారు. కానీ ఇటీవల ఓ మహిళ అఘోరి దిగంబరంగా వచ్చి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడంతో.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అఘోరాలు ఎక్కువగా కాశీలో కనబడతారు. అలాగే శైవ క్షేత్రాల దర్శనానికి ఎక్కువగా వెళుతుంటారు. దానిలో భాగంగానే మహిళా అఘోరి కొమురవెళ్లి మల్లికార్జున స్వామి దర్శనానికి రావడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఆలయ పరిసరాల్లో దిగంబర మహిళ అఘోరీ సంచరించడం భక్తులు, స్థానికులు విస్మయం చెందారు. సాధారణంగా.. అఘోరాల గురించి వింటుంటాం. శివునిపై అపారమైన భక్తితో ఆ దిగంబరునికి తమ జీవితాన్ని అకింతం చేస్తుంటారు. బంధాలు, బంధుత్వాలను త్వజించి.. శివ నామ స్మరణలో లీనమైపోతుంటారు. కాశీలాంటి శైవక్షేత్రాల్లో లేదా హిమాలయాల్లో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒళ్లంతా విభూదితో.. రుద్రాక్ష మాలలతో.. జటాజూటాలతో.. తపస్సులో నిమగ్నమై పోతుంటారు. వీరి జీవనశైలి కూడా సాధారణ మనుషులకు భిన్నంగా ఉంటుంది. కొందరు అఘోరాలు ఒంటికి బట్టలు చుట్టుకుంటే.. మరికొందరు మాత్రం దిగంబరులుగానే ఉంటారు.

ఇదంతా మనకు తెలిసిందే. కానీ.. అఘోరాల్లో మగవాళ్లే కాదు.. మహిళా అఘోరిలు కూడా ఉంటారన్నది.. ఇప్పుడు అసలు చర్చ..ఎక్కడో కాశీలోనో, హిమాలయాల్లోనో ఉంటే.. అంతపెద్ద చర్చ కాదు కానీ.. ఓ మహిళా అఘోరి తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లన్న ఆలయం పరిసరాల్లో కనిపించటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో శివుని భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. గుట్ట మీద ఓ బండ సొరికలో వెలసిన మల్లన్న.. మహిమాన్వితునిగా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తెలంగాణ ప్రజలు నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే కొమురవెల్లి మల్లన్న ఆలయ దర్శనానికి ఓ మహిళా అఘోరా విచ్చేసింది. ఓ కారులో వచ్చిన ఆ మహిళా అఘోరిని చూసి అక్కడున్న భక్తులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు..ఇప్పటివరకు మగవారే అఘోరాలుగా ఉండటం చూసిన ప్రజలు.. అకస్మాత్తుగా మహిళా అఘోరిని చూడటంతో అవాక్కవటం వారి వంతైంది. ఆ మహిళా అఘోరి.. దిగంబరురాలిగా రావటం గమనార్హం. ఒళ్లంతా విభూది ధరించి..మెడలో, చేతులకు రుద్రాక్షల మాలలతో, చేతిలో త్రిశూలంతో..ఎలాంటి దుస్తులు ధరించకుండా దిగంబరా వతారంలో ఆ అఘోరి కనిపించటంతో.. అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ మహిళా అఘోరి వచ్చిన వాహనం కూడా ఆమె ఫొటోలతో, శివుని పోస్టర్లతో కొంచెం వింతగానే ఉంది. ఒక్కసారిగా ఆ అఘోరిని చూసిన స్థానికులు, భక్తులు ఆమెను వింతగా చూడగా.. కొందరు ఆమె కదలికలను వీడియో తీయగా.. ఇప్పుడు అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. వీరిని అఘోరాలనే కాకుండా నాగసాధువులు అని కూడా పిలుస్తుంటారు.