Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: అదృష్టం తలుపు తట్టాలంటే.. ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. లేదంటే నిరాశే..

Vastu Tips For Signature: వాస్తు శాస్త్రం ప్రకారం, జీవితంలో సంతకం పాత్ర చాలా ముఖ్యమైనది. ఓ తప్పు సంతకంతో మీరు పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయేలా చేస్తే, సరైన సంతకం అదృష్టం తలుపులు తెరుస్తుంది.

Vastu Tips: అదృష్టం తలుపు తట్టాలంటే.. ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. లేదంటే నిరాశే..
Vastu Tips
Follow us
Venkata Chari

|

Updated on: Dec 05, 2022 | 6:55 AM

ఓ వ్యక్తి సంతకం అతనికి ప్రత్యేక గుర్తింపు. ప్రతి ఒక్కరికి సంతకం చేయడానికి వారికో ప్రత్యేక మార్గం ఉంటుంది. మనం ఏదైనా ముఖ్యమైన పని చేసినప్పుడు ఎక్కడో ఒకచోట సంతకం పెట్టాలి. సంతకాన్ని, స్వభావాన్ని ఎప్పటికీ మార్చకూడదని చెబుతుంటారు. కానీ, అదే సమయంలో అది తప్పు అయితే వెంటనే మార్చాలని కూడా చెబుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, తప్పు సంతకం మీకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, సరైన సంతకం మీ విధికి తలుపులు తెరుస్తుంది. వాస్తవానికి, ఆర్థిక, కార్యాలయ విషయాలలో మీ సంతకం పాత్ర చాలా ముఖ్యమైనది. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, వాస్తు శాస్త్రం ప్రకారం, మీ సంతకంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా మీ విధిని మార్చుకోవచ్చని చెబుతున్నారు.

సంతకంలో ఈ మార్పులతో అదృష్టం..

వాస్తు ప్రకారం, సంతకంలో కొన్ని మార్పులు చేస్తే, మీరు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు. వాస్తు ప్రకారం, మీరు వీలైనంత త్వరగా ధనవంతులు కావాలనుకుంటే, డబ్బు ఆదా చేయాలనుకుంటే, మీ సంతకం కింద ఒక సరళ రేఖను గీసి, దాని కింద రెండు చుక్కలను ఈ రోజు నుంచి ఉంచడం ప్రారంభించండి. దాని ప్రభావం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు. మీరు డబ్బు ఆదా చేయడం ప్రారంభించగానే, మీ సంతకం కింద ఉన్న చుక్కల సంఖ్యను క్రమంగా పెంచండి. అయితే, ఈ పాయింట్ల సంఖ్య 6 కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి. వాస్తు ప్రకారం, మీ సంతకంలో ఈ చిన్న మార్పు చేయడం ద్వారా మీరు మీ ఇంటికి శ్రేయస్సును తీసుకురావచ్చు.

ఈ రోజు నుంచి ఇలా సంతకం చేయడం ఆపండి..

వాస్తు ప్రకారం, సంతకం చేసిన తర్వాత, మధ్యలో నుంచి గీత గీసి, దానిని కత్తిరించే వ్యక్తి ఎప్పుడూ సంతృప్తి చెందడంట. అలా చేయడం చాలా అశుభంగా భావిస్తారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ తమను తాము నిందించుకుంటుంటారు. చిన్న విషయాలకు త్వరగా కోపం తెచ్చుకుంటారు. ఈ రకమైన సంతకం ఉన్న వ్యక్తి తన/ఆమె ప్రేమను వ్యక్తపరచడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తులు ప్రతి విషయంలోనూ తప్పులు వెతకడంలో ప్రసిద్ధి చెందారు. అదే సమయంలో, వారు తమను తాము శిక్షించుకుంటూ ఉంటారు. అలాంటి వారు తమ సంతకాన్ని మార్చడంలో ఆలస్యం చేయకూడదు.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు నమ్మకాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న విషయాల ఆధారంగా అందించాం. దీనిని టీవీ9 తెలుగు ఆమోదించలేదు.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..