Lord Shiva: నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పడానికి నియమాలున్నాయి..! సరైన మార్గం ఏమిటంటే

|

Jul 26, 2024 | 2:52 PM

శివునికి నంది అంటే అపారమైన ప్రేమ..అతను చెప్పేదంతా వింటాడు. కనుక నందిని ఆరాధించడం విశిష్టమైనదని భావిస్తారు. ఎవరైతే తమ కోరికను నందిశ్వరుడి చెవిలో చెబుతారో ఆ కోరికను శివుడు తప్పకుండా తీరుస్తాననే వరం నందికి శివుడు ఇచ్చాడనే నమ్మకం ఉంది. ఈ విషయాన్నీ పురాణ గ్రంథాలలో కూడా వివరించారు.

Lord Shiva: నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పడానికి నియమాలున్నాయి..! సరైన మార్గం ఏమిటంటే
Nandishwara
Follow us on

హిందూ మతంలోశివ ప్రధమ గణాల్లో నందీశ్వరుడికి ప్రముఖ స్థానం ఉంది. నంది శివుడి వాహనం కూడా.. ఏ శివాలయాల్లోకి వెళ్ళినా అక్కడ ముందుగా కనిపించేది శివుడికి ఎదురుగా ఉండే నంది. శివునికి అభిముఖంగా నంది విగ్రహం దర్శనం ఇస్తుంది. నందిని శివునికి ఇష్టమైన సభ్యుడిగా పరిగణిస్తారు. శివయ్య సేవ నంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంతేకాదు శివుని ద్వారపాలకుడిగా నంది శివుని సేవిస్తాడని నమ్మకం. అందుకనే ఎవరైనా భక్తులు తమ కోరికను నంది చెవిలో చెప్పడం ద్వారా అది నేరుగా శివునికి చేరుతుందని కూడా విశ్వాసం.

శివునికి నంది అంటే అపారమైన ప్రేమ..అతను చెప్పేదంతా వింటాడు. కనుక నందిని ఆరాధించడం విశిష్టమైనదని భావిస్తారు. ఎవరైతే తమ కోరికను నందిశ్వరుడి చెవిలో చెబుతారో ఆ కోరికను శివుడు తప్పకుండా తీరుస్తాననే వరం నందికి శివుడు ఇచ్చాడనే నమ్మకం ఉంది. ఈ విషయాన్నీ పురాణ గ్రంథాలలో కూడా వివరించారు.

పురాణ గ్రంథాల ప్రకారం శివుడు ఎక్కువ సమయం ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. శివుని ధ్యానంలో ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అతని గణ నంది ఎల్లప్పుడూ కాపలాగా ఉంటుంది. శివునికి సేవ చేస్తుంది. శివుడు తపస్సు చేస్తున్నప్పుడు అతనిని కలవడానికి ఎవరు వచ్చినా తమ కోరికలను నంది చెవుల్లో గుసగుసలాడుతూ చెప్పేవారు. నందిజీ చెవుల్లో భక్తులు చెప్పే కోరికలు నేరుగా పరమశివునికి చేరి నెరవేర్చేవాడు.

ఇవి కూడా చదవండి

అందుకే నేటికీ భక్తులు తమ కోరికలు తీర్చమంటూ నంది చెవిలో తమ కోరికలు చెబుతారని నమ్ముతారు. అయితే నందిశ్వరుడి చెవిలో మాటలు చెప్పడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. నంది చెవిలో తమ కోరికలను చెప్పడానికి సరైన మార్గం ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం..

నంది చెవిలో కోరికలు చెప్పడానికి సరైన మార్గం, నియమాలు ఏమిటంటే?

  1. ముందుగా శివుడిని, పార్వతిని పూజించండి. దీని తరువాత నందికి నీరు, పువ్వులు, పాలు సమర్పించండి. అనంతరం అగరబత్తీలు వెలిగించి నందికి హరతినివ్వండి.
  2. నందీశ్వరుడికి ఏ చెవిలోనైనా మీ కోరికలు చెప్పవచ్చు. అయితే ఎడమ చెవిలో కోరికలు చెప్పడం చాలా ఫలప్రదంగా పరిగణించబడుతుంది.
  3. నంది చెవిలో మీ కోరికను చెప్పే ముందు, “ఓం” అనే పదాన్ని ఉచ్చరించండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు శివునికి త్వరగా చేరుతాయని నమ్ముతారు.
  4. నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు.. ఏ కోరికను కోరబోతున్నారో దానిని మరెవ్వరూ వినకూడదని గుర్తుంచుకోండి. అందువల్ల కోరికను చాలా నెమ్మదిగా.. స్పష్టంగా నంది చెవిలో చెప్పండి.
  5. కోరికను చెప్పేటప్పుడు మీరు మీ రెండు చేతులతో మీ పెదవులను దాచుకోవాలి తద్వారా మీ కోరికను చెబుతున్న సమయమలో ఇతర వ్యక్తులకు ఆ కోరిక తెలియదు.
  6. నందిశ్వరుడి చెవుల్లో కోరికలు ఇతరులకు హాని కలిగించాలని లేదా తప్పు చేయాలని కోరుకోవద్దు. అంతేకాదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి.
  7. మీ కోరిక చెప్పిన తర్వాత ఖచ్చితంగా నందీశ్వర మా కోరిక తీర్చండి’ అని విజ్ఞప్తి చేయండి. ఒక సమయంలో ఒక కోరిక చెప్పండి. అత్యాశకు లొంగిపోకం. ఒకేసారి అనేక కోరికలు కోరవద్దు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు