Papmochani Ekadashi: రేపు పాపమోచని ఏకాదశి వ్రతం శుభ సమయం.. ఏం చేయాలి? ఏమి చేయకూడదంటే..

ఉపవాసం, దానాలతో పాటు, పాపమోచని ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల తెలిసి, తెలియక చేసిన అన్ని సమస్యలు, పాపాల నుండి ఉపశమనం పొందుతారు. ఈ ఉపవాస సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పాపమోచిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ముందు ఆ నియమాల గురించి తెలుసుకుందాం.. నిర్లక్ష్యం చేస్తే ఈ వ్రత నియమం భంగం అవుతుంది. 

Papmochani Ekadashi: రేపు పాపమోచని ఏకాదశి వ్రతం శుభ సమయం.. ఏం చేయాలి? ఏమి చేయకూడదంటే..
Sri Maha Vishnu

Updated on: Apr 05, 2024 | 12:52 PM

చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథిని పాపమోచని ఏకాదశి అంటారు. ప్రతి నెలా ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువును పూజించి, ఆచారాల ప్రకారం ఉపవాసం ఉంటే శ్రీ హరి అనుగ్రహం లభిస్తుందని మత విశ్వాసం. సంవత్సరంలో మొదటి మాసంలో వచ్చే ఏకాదశి రోజున పాపాల నుంచి విముక్తి పొందేందుకు, పుణ్యం పొందడానికి ఈ వ్రతాన్ని పూర్తి నియమ నిష్ఠలతో ఆచరిస్తారు. ఈ ఏకాదశి వ్రతం పుణ్యాన్ని పొందేందుకు, శాస్త్రాలలో కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొనబడ్డాయి.

ఉపవాసం, దానాలతో పాటు, పాపమోచని ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల తెలిసి, తెలియక చేసిన అన్ని సమస్యలు, పాపాల నుండి ఉపశమనం పొందుతారు. ఈ ఉపవాస సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పాపమోచిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ముందు ఆ నియమాల గురించి తెలుసుకుందాం.. నిర్లక్ష్యం చేస్తే ఈ వ్రత నియమం భంగం అవుతుంది.

పాపమోచని ఏకాదశి రోజు ఏం చేయాలంటే

  1. ఏకాదశి వ్రతం రోజున దానానికి, దక్షిణకు చాలా ప్రాముఖ్యత ఉంది.అవసరంలో ఉన్న వ్యక్తికి దానధర్మాలు చేయనంత వరకు ఏకాదశి ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుందని ఒక నమ్మకం. కావున ఈ రోజు పేదలకు దానం చేయండి.
  2. ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి అనంతరం తులసి మొక్కకు నీళ్ళు సమర్పించాలి. రోజంతా ఏమీ తినకూడదు. ఇలా సాధ్యం కాకపోతే పండ్లు తినవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. పగటి సమయంలో మట్టిపాత్రలో నీరు నింపి దేవాలయంలో అన్నదానం లేదా ధాన్యాన్ని దానంగా ఇవ్వాలి.  ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణ చేయాలి.
  5. సాయంత్రం సమయంలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆచారాల ప్రకారం పూజించాలి. అటువంటి పరిస్థితిలో పాపమోచిని ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇలా చేయడం వలన దేవుడు త్వరగా సంతోషిస్తాడు. శుభ ఫలితాలను ఇస్తాడని నమ్మకం.

పాపమోచని ఏకాదశి రోజున చేయ కూడని పనులు

  1. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున అన్నం లేదా ఎలాంటి తామసిక ఆహారాన్ని తినకూడదు. ఈ నియమాన్ని విస్మరిస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కదు. అందుకే ఈ రోజు అన్నం తినవద్దు.
  2. ఏకాదశి రోజున నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. హిందూ విశ్వాసం ప్రకారం, ఏకాదశి రోజున విష్ణువును పూజిస్తారు. కావున ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించండి.
  3. పాపమోచని ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తెంపవద్దు. ఒకరోజు ముందుగా తులసి ఆకులను మొక్క నుంచి తీసి మర్నాడు పూజలో నైవేద్యంగా ఉంచాలి.
  4. ఏకాదశి రోజున జుట్టు , గోర్లు మొదలైన వాటిని కత్తిరించకూడదు. ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం వస్తుందని, దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్మకం.
  5. ఏకాదశి వ్రతం పాటించే వ్యక్తి పొరపాటున కూడా వేరొకరు దానం చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు లేదా తినకూడదు.
  6. ఈ రోజు ఉపవాసం ఉండే వ్యక్తి తెల్లవారుజాము వరకు నిద్రపోకూడదు. కోపం తెచ్చుకోకూడదు. ఇంట్లో ఎలాంటి వాగ్వాదం జరగకుండా చూసుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి.

పాపమోచని ఏకాదశి వ్రతంలో ఏమి తినకూడదు? ఏమి తినాలంటే

  1. పద్మ, స్కంద, విష్ణు ధర్మోత్తర పురాణాల ప్రకారం ఈ ఏకాదశి వ్రతంలో ఆహారం తీసుకోరాదు. ఈ ఉపవాసంలో, ఉపవాస నియమాలు వివరించబడ్డాయి. అయితే పండ్లు మాత్రం తినవచ్చు.
  2. అంతేకాదు పాపమోచని ఏకాదశి రోజున వాసనతో కూడిన వస్తువులను తినవద్దు. ఎందుకంటే ఇది శరీరం,  మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక వెల్లుల్లి , ఉల్లిపాయలను తినకూడదు.
  3. వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పు, క్యారెట్, టర్నిప్, క్యాబేజీ, బచ్చలికూర మొదలైన వాటిని తినకూడదు. ఈ ఏకాదశి నాడు అన్నం తినకూడదనే నమ్మకం ఉంది.
  4. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వారు పండు లేదా నీటిని తీసుకోవచ్చు. ఏకాదశి వ్రతం పాటించే ముందు దశమి తిథి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. ఏకాదశి తిథి రోజున శ్రీ మహా విష్ణువును ఆచారాల ప్రకారం పూజించాలి.
  5. పాపమోచని ఏకాదశి వ్రతంలో పండ్లు, చిలగడ దుంప, బత్తాయి పండ్లు, కొబ్బరి నీరు, పాలు, బాదం పాలు వంటి వాటిని తీసుకోవచ్చు.

పాపమోచని ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలి?

శాస్త్రాల ప్రకారం పాపమోచినీ ఏకాదశి రోజున నాలుగు చేతులున్న శ్రీ మహా విష్ణువు రూపాన్ని పూజిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వ్యక్తి దశమి తిథి రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. స్నానం చేసిన తర్వాత, శుభ్రమైన,  లేత రంగుల బట్టలు ధరించి ఉపవాస దీక్షను చేపడుతున్నట్లు ప్రతిజ్ఞ చేయాలి.

పాపమోచినీ ఏకాదశి వ్రతం శుభ సమయం

పాపమోచని ఏకాదశి వ్రతం పారణ వ్రతాన్ని ఏప్రిల్ 6వ తేదీ అంటే రేపు జరుపుకుంటారు. ఈ సంవత్సరం  ఉదయం 6:05 నుంచి 8:37 వరకు శుభ సమయం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు