AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maghamasam: మాఘమాసంలో నదీ స్నానానికి, సూర్యుడు పూజకు గల విశిష్ట స్థానం ఏమిటో తెలుసా..

హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది.  ఈ నెలలో  చేసే నదీస్నానం.. శ్రీమన్నారాయణుని పూజ ఇచ్చే దానం.. కోటి క్రతువుల ఫలితాలను ఇస్తుంది.

Maghamasam: మాఘమాసంలో నదీ స్నానానికి, సూర్యుడు పూజకు గల విశిష్ట స్థానం ఏమిటో తెలుసా..
Magha Masam
Surya Kala
|

Updated on: Jan 22, 2023 | 9:12 PM

Share

తెలుగు నెలల్లో చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసం మాఘమాసం. చంద్రుడు మఖ నక్షత్రంతో ఏర్పడే మాసం కనుక  మాఘమాసం అయింది. అఘము అంటే పాపము అని అర్థము. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టే మాఘమాసమునకు ప్రత్యేకత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ నెల శ్రీ మహా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది.  ఈ నెలలో  చేసే నదీస్నానం.. శ్రీమన్నారాయణుని పూజ ఇచ్చే దానం.. కోటి క్రతువుల ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో ఏ నది నీరైనా  గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది. ఈ మాసంలో తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరిస్తారు. ప్రత్యేక్ష భగవానుడైన సూర్య భగవానుడిని పూజిస్తారు.

స్నానం చేస్తూ పఠించాల్సిన శ్లోకం:

దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం ” అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ.. నదిలో, లేదా బావుల వద్ద స్నానం చెయ్యడం వలన విశేష ఫలితం లభిస్తుంది. నదుల్లో స్నానం చేయడానికి వీలుకాని యెడల కనీసం ఇంట్లో స్నానం చేసి సమయంలోనైనా గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.

ఇవి కూడా చదవండి

స్నానాంతరం పాటించాల్సిన నియమాలు: 

  1. శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.
  2. ఆదివారం రోజున సూర్యుడిని పూజించాలి
  3. మాఘమాసంలో రోజూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.. సూర్యోదయ సమయంలో సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం సమర్పించాలి.
  4. ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఇలా చేయడం వలన వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. సూర్య భగవానుడు ఆయురారోగ్యాలను ఇస్తాడని శాస్త్ర వచనం.
  5. ఈ మాసంలో రథ సప్తమితో  శ్రీ పంచమి, వరచతుర్డశి, వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ వంటి పర్వదినాలు వస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..