Women Hair Style: హిందూసాంప్రదాయంలో స్త్రీ జడ విశిష్టత ఏమిటి.. జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారో తెలుసా..!

| Edited By: Surya Kala

Jul 15, 2021 | 8:57 AM

Women Hair Style: భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో ఆడవారు జడ వేసుకోవడం తప్పనిసరి. ఇప్ప్పుడు జుట్టు విరబోసుకోవడం.. వి కట్..యూ కట్, ఫెథర్ కట్ అంటూ రకరకాలుగా..

Women Hair Style: హిందూసాంప్రదాయంలో స్త్రీ జడ విశిష్టత ఏమిటి.. జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారో తెలుసా..!
Woman Hair Styles
Follow us on

Hindu Traditional Women Hair Style: భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో ఆడవారు జడ వేసుకోవడం తప్పనిసరి. ఇప్ప్పుడు జుట్టు విరబోసుకోవడం.. వి కట్..యూ కట్, ఫెథర్ కట్ అంటూ రకరకాలుగా జుట్టుని కత్తిరించుకుని విరబోసుకుని ఉండడం ఫ్యాషన్ అయిపొయింది కానీ..రెండు తరాల ముందు వరకూ అమ్మాయిలకు జడ వేసుకోవడం తప్పనిసరి.. చిన్న పిల్లలు రెండు జడలు వేసుకుంటే.. యువత ఒక జడను .. అమ్మతనం నుంచి ఒక అడుగు ముందుకు వేస్తె.. ముడి వేసుకునేవారు. అంతేకాదు.. అప్పట్లో అమ్మాయిలు జడ వేసుకుని.. వాటికీ ప్రత్యేకమైన భరణాలను జడపాళీ (నాగరం), జడగంటలు, చామంతిపువ్వు, పాపిటబిళ్ళ, చెంపసరాలు ముఖ్యమైనవి అలంకరించుకునేవారు. అంతేకాదు.. అప్పట్లో స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరిగితే దారిద్రమని.. జేష్టాదేవికి చిహ్నమని భావించేవారు. తల వెంట్రుకలను ఒక పద్ధతిలో అమర్చుకొనే పద్ధతిని జడ అంటారు.. అయితే స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు ఈరోజు తెలుసుకుందా..

ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.
రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్లికాలేదని అర్ధం. అంటే ఆ అమ్మాయిలో జీవ + ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్ధం. పెళ్ళైన అమ్మాయి జుట్టు మొత్తం కలిపి ఒకటే జాడగా వేసుకునేవారు. ఇలా ఒక జడ వేసుకోవడం అంటే ఆ యువతి తన భాగస్వామిని చేరుకుందని.. వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం. ఇక మహిళలు జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే .. ఆ మహిళకు సంతానం ఉందని.. ఇల్లాలిగా అన్ని బాధ్యతలను మోస్తూ.. సంసారాన్ని గుట్టుగా ముడుచుకుంది అర్ధం చెబుతుంది.. ముడి వేసుకున్న మహిళ.

అయితే అప్పట్లోనే చిన్నారిగా రెండు జడలు వేసుకున్నా.. ఒక జడవేసుకున్నా.. ముడి వేసుకున్నా జుట్టుని మూడు పాయలుగా విడదీసి.. త్రివేణి సంగమంలా కలుపుతూ.. అల్లేవారు ఈ మూడు పాయలకు కూడా మన హిందూ ధర్మంలో అర్ధాలున్నాయి.

1. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం.

2. సత్వ, రజ, తమో గుణాలు,

3. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని అర్ధములు.

అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు ఆధునికత పేరుతో మనం ఎంత మారినా.. నేటికీ ప్రపంచ దేశాలను ఆకర్షించబడుతున్నాయి. అయితే మన సంస్కృతిని మనమే ఆధునిక పేరుతో దూరం చేసుకుంటున్నాం.

Also Read: తిరుపతిలోని ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాలనియామకం.. రేపే చివరి తేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..