ప్రపంచంలో చాలా మంది మహిళలకు సరైన హోదా, గౌరవం ఇవ్వబడలేదని చెబుతారు. వారు నిరంతరం దోపిడీకి గురవుతున్నారని సరైన స్థానం, గౌరవం ఇవ్వడం లేదని నిరంతరం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇది పైకి నిజమే అనిపించినా.. మన హిందూ ధర్మంలో స్త్రీకి ప్రముఖ స్థానం ఇచ్చింది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారని పేర్కొంది. అయితే బంగారానికి కూడా ఎలా రక్షణ అవసరమో.. సమాజంలో స్త్రీకి కూడా రక్షణ అవసరం అని కొన్ని కట్టుబాట్లను నియమాలను ఏర్పాటు చేసింది.
అదేవిధంగా గొప్ప వ్యక్తికి, గొప్ప వస్తువులకు రక్షణ అవసరం. పూజలో ఉపయోగించే పువ్వుల నుంచి శ్రేష్ఠతకు దారితీసే ప్రతిదానికీ ఒక చట్రం అవసరం. స్త్రీ కూడా అంతే. స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పిల్లలు రక్షించాలి. ఆమెకు స్వేచ్ఛ ఎందుకు లేదనే దానికి సమాధానం ఏమిటంటే ఆమె చాలా పూజ్యమైనది.. అందుకే ఆ స్త్రీని రక్షించడం తండ్రిగా, భర్తగా , కొడుకుగా వారి కర్తవ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి.
అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం స్త్రీకి కష్టాలు కలిగించే ఎటువంటి పరిస్థితిని సృష్టించకూడదు. ఎందుకంటే అలా చేయడం మహా పాపం. గరుడ పురాణం పాపాలకు, పుణ్యాలకు తగిన పరిణామాలను సూచించే అత్యంత ప్రామాణికమైన పురాణం. పర స్త్రీని కోరుకున్నా.. స్త్రీలను ఇబ్బందులకు గురి చేసినా బ్రహ్మరాక్షస స్థితి బారిన పడాల్సి ఉంటుంది. బ్రహ్మ రాక్షసి స్థితి అంటే మరణానంతరం శుభాలు పొందకుండా సంచరించే స్థితి అని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం ఇది అత్యంత నీచమైన, కఠినమైన స్థితి. గరుడ పురాణం ప్రకారం స్త్రీని వేధిస్తే.. ఈ స్థితికి చేరుకోవాలని చెబుతుంది.
సంస్కారవంతురాలు, విద్యావంతురాలు, గౌరవప్రదురాలు అయిన స్త్రీని గౌరవిస్తే, దేవతలు కూడా అక్కడ సంతోషంగా ఉంటారని మనుస్మృతిలో పేర్కొనబడింది. అదే విధంగా గరుడ పురాణం ప్రకారం స్త్రీలకు సంబంధించిన అనేక నియమాలున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు