Gayatri Mantra: పూజలో గాయత్రీ మంత్రం ప్రాముఖ్యత ఏమిటి? జపించే విధానం, పద్ధతిని తెలుసుకోండి

|

Jun 26, 2023 | 7:36 AM

తల్లిని మించిన దైవం లేదు.. గాయత్రిని మించిన మంత్రం లేదు అని అంటారు. సనాతన సంప్రదాయం ప్రకారం ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. 

Gayatri Mantra: పూజలో గాయత్రీ మంత్రం ప్రాముఖ్యత ఏమిటి? జపించే విధానం, పద్ధతిని తెలుసుకోండి
Gayatri Mantram
Follow us on

సనాతన హిందూ ధర్మంలో మంత్రాలను పఠించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మంత్రాలను పఠించడం వల్ల వ్యక్తిలో సానుకూల శక్తి వస్తుంది. గాయత్రీ మంత్రం నాలుగు వేదాల సారాంశంగా పరిగణించబడుతుంది. అవి ఈ మంత్రం నుండి మాత్రమే ఉద్భవించాయి. ముఖ్యంగా గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా మనిషి మానసిక ప్రశాంతతను పొందుతాడు. అందుకనే తల్లిని మించిన దైవం లేదు.. గాయత్రిని మించిన మంత్రం లేదు అని అంటారు. సనాతన సంప్రదాయం ప్రకారం ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల శరీరంలోని ప్రతికూలత తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని  నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీనితో పాటు, వ్యక్తికి కీర్తి , డబ్బు కూడా లభిస్తుంది. అయితే, ఈ మంత్రాన్ని ఉచ్చరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ప్రత్యేక శ్రద్ధ అవసరం.

గాయత్రి మంత్రం: 

ఇవి కూడా చదవండి

ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్

రోజూ గాయత్రి మంత్రాన్ని జపించడం వలన పొందే ప్రయోజనాలు 

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని భావన. గాయత్రీ మంత్రాన్ని ఎల్లప్పుడూ సూర్యోదయానికి రెండు గంటల ముందు.. సూర్యాస్తమం అయిన ఒక గంట తర్వాత జపించాలని హిందువుల విశ్వాసం. సాధకుడు మౌనంగా ఉండి కూడా గాయత్రీ మంత్రాన్ని జపించగలడని చెబుతారు. గాయత్రీ మంత్రాన్ని ఎప్పుడూ తూర్పు దిక్కున కూర్చొని జపించాలి.

గాయత్రీ మంత్రాన్ని జపించేటప్పుడు చేయకూడని తప్పులు 

రాత్రి సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వలన విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. మత విశ్వాసాల ప్రకారం ఈ మంత్రాన్ని జపించే ముందు స్నానం చేసి పసుపు బట్టలు ధరించాలి. అయితే గాయత్రీ మంత్రం నల్ల బట్టలు ధరించి ఎప్పుడూ జపించకండి. దక్షిణ దిశలో కూర్చొని ఈ మంత్రాన్ని ఎప్పుడూ జపించకూడదని చెబుతారు. సాత్విక ఆహారం తీసుకునే వారు మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలి. మాంసాహారం, మద్యం సేవించే వారు ఈ మంత్రాన్ని జపించకూడదు. లేకపోతే సాధకులు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు దీన్ని దృవీకరించడంలేదు.