
సాధారణంగా ఎవరికైనా కళ్లు అదరడం అనేది కామన్ విషయం. అయితే ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కళ్లు అదిరితే చెడులు, మంచి జరుగుతాయని అంటారు. అయితే సైన్స్ ప్రకారం.. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఇలా జరుగుతాయని చెప్తారు. ఈ విషయం పక్కన పెడితే.. కళ్లు అదిరాయంటే మాత్రం చాలా భయ పడి పోతూంటారు. నిజానికి ఏ కన్ను అదిరితే మంచిది అన్న విషయం చాలా మందికి తెలీదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇది మగవారికి ఒకలా, మహిళలకు వేరేలా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదరడం వల్ల ఏం జరుగుతుంది? అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడవారికి ఎడమ కన్ను అదిరితే.. ఎలాంటి కంగారూ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎడమ కన్ను అదిరిందంటే త్వరలోనే మీకు సంతోషం, ఆనందం కలిగించే పనులు ఇంట్లో జరుగుతాయి. అలాగే కొత్త బట్టలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
లేడీస్‌కు ఎడమ కన్ను అదరడం వల్ల శుభ ప్రదమని జ్యోతిష్యులు అంటారు. ఒక మహిళకు ఎడమ కన్ను అదిరిందంటే.. వారే ఏవో మంచి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారని అర్థం. అదే విధంగా మహిళలకు ఎడమ కన్ను అదరడం వల్ల కొత్త పనులకు శుభ సూచికమని చెబుతారు. ఎడమ కన్ను అదిరితే మహిళలకు సంతోషానికి, అదృష్టానికి సంబంధించే సంకేతంగా చెప్పొచ్చు.
మహిళలకు ఎడమ కన్ను అదరడం వల్ల భవిష్యత్తులో మీరు త్వరగా డబ్బు సంపాదంచబోతారని.. అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుందని జ్యోతిష్యులు అంటారు. ఈ కన్ను అదిరితే మీకు త్వరలోనే ధన లాభం కలగబోతుందని అర్థం అవుతుంది. అంతే కాకుండా.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కన్ను అదరడం వల్ల ఇంటికి అతిథులు వస్తారని ఇంట్లో పెద్దలు అంటూ ఉంటారు. ఎడమ కన్ను అదురు.. ఇంటికి చుట్టాల రాకను చెప్తుందని అంటారు.
కన్ను అదరడం వల్ల కొన్ని సైన్స్ కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు వైద్యులు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీలు వంటివి ఎక్కువ సేపు చూడటం వల్ల ఇలా జరుగుతుందని అంటారు. అదే విధంగా.. కంటికి తగని విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలా కన్ను అదురుతుందని వైద్యులు అంటారు.