కోట్లాది మంది హిందువుల కల తీరే సమయం ఆసన్నం అవుతున్న వేళ.. రామ భక్తులు తమ భక్తిని వివిధ రకాలుగా చాటుతున్నారు. అందమైన రామ మందిర నిర్మాణంలో మేము సైతం అంటున్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఓ రామభక్తుడు ఐదున్నర లక్షల రూపాయలతో తయారు చేసిన భారీ అగరబత్తిని అయోధ్యకు తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద దూద్ బత్తిని అయోధ్యకు తీసుకుని వెళ్ళడానికి దాదాపు నాలుగు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని తెలుస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి సహా ప్రముఖుల సమక్షంలో వడోదరలోని నవల్ఖి గ్రౌండ్‌లో భారీ కార్యక్రమాన్ని చేపట్టి. అయోధ్యకు తరలించనున్నారు.
వడోదరకు చెందిన రామభక్తుడు తయారుచేసిన అద్భుతమైన, భారీ ధూపద్రవ్యం రామ జన్మభూమి భూమి అయోధ్యలో తన పరిమళాన్ని వెదజల్ల నుండి. భవ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠా మోహోత్సవంలో ఈ అగరబత్తిని ఉపయోగించనున్నారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం రామభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వడోదరలోని తర్సాలికి చెందిన విహాభాయ్ భర్వాద్ వృత్తి రీత్యా రైతు, పశువుల పెంపకందారుడు. రామయ్యను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తాడు. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురష్కరించుకుని భారీ అగరబత్తిని తయారు చేస్తున్నారు. ఇది 108 అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పు గల భారీ దూద్ బత్తి. దీనిని డిసెంబర్ నెలాఖరున వడోదర నుంచి అయోధ్య వరకు భారీ ఊరేగింపుగా తీసుకుని వెళ్లనున్నారు.
గతంలో కూడా మూడు పెద్ద అగరుబత్తీలను తయారు చేసిన విహాభాయ్ భర్వాద్.. 108 అడుగుల పొడవున్న ఈ అగరబత్తీని తయారు చేసేందుకు గుగ్గిలం, ధూపం, నెయ్యి, ఆవు పేడతో సహా మొత్తం 3428 కిలోల వివిధ పదార్థాలను వినియోగించామని తెలిపారు.
గిరి ఆవు నెయ్యి.. 91 కిలోలు, 376 కిలోల గుగ్గిలం , 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల ఎండు కొబ్బరి పొడి, 425 కిలోల యజ్ఞానికి ఉపయోగించే వస్తువుల సహా 1475 కిలోల ఆవు పేడ పొడిని ఉపయోగించారు. ఇలా మొత్తం 3400 కిలోల బరువుతో ఈ అగరబత్తిని సిద్ధం చేశారు. దీని తయారీ నిమిత్తం మొత్తం 3428 కిలోల మెటీరియల్‌ను వినియోగించారు.
ఈ అగర్బత్తిని బహిరంగం ప్రదేశంలో ఎండ, వేడి ఉన్న సమయంలో తయారు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ వర్షాలు కురుస్తుండటంతో తదుపరి పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాదు ఇప్పటి వరకు తయారు చేసిన అగరుబత్తీలను ప్లాస్టిక్ కవర్ తో చుట్టి వర్షం నుంచి రక్షణ కల్పించారు. వర్షాలు తగ్గిన వెంటనే మిగిలిన పనులు చేపట్టనున్నారు. 108 అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పుతో పూర్తిస్థాయి ధూపదీపాన్ని డిసెంబర్ చివరిలో సిద్ధం చేస్తామని విహాభాయ్ భర్వాద్ తెలిపారు.
108 అడుగుల పొడవున్న ఈ ధూప్ స్టిక్ ను అయోధ్యకు చేరవేయడానికి దాదాపు నాలుగున్నర లక్షల రూపాయలు అవుతుందని తెలుస్తోంది. వడోదరలోని తర్సాలీలో విహాభాయ్ ఇంటికి సమీపంలోని బహిరంగ మైదానంలో నిర్మిస్తున్న భారీ అగరబత్తిని సిద్ధం చేసిన తర్వాత నవల్ఖి మైదానానికి తీసుకుని వెళ్లనున్నారు.
అక్కడ భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నగర, జిల్లాకు చెందిన ప్రముఖులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉండేలా ప్లాన్ చేశారు. అయోధ్యకు బయలు దేరే అరగబత్తి ఊరేగింపును పచ్చజెండా ఊపి మొదలు పెట్టనున్నారు. వడోదర నుండి అయోధ్యకు దూరం దాదాపు 1,800 కి.మీ. ధూప్‌స్టిక్ రవాణా కోసం ప్రత్యేక ట్రైలర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కసారి వెలిగిస్తే 45 రోజుల వరకు నిరంతరం సువాసనలు వెదజల్లుతుందని విహాభాయ్ తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..