Vinayaka Chaviti 2024: విఘ్నాలకధిపతి వినాయకుడి జననం.. పురాణాల ప్రకారం తెలియని కొన్ని విశేషాలు ఏమిటంటే..

|

Aug 28, 2024 | 6:13 PM

వామన పురాణం లో గణేశుడి జన్మ గురించి మరొక కథ ఉంది. సంతానం కావాలనే కోరికతో పార్వతీ దేవి పసుపుతో ఒక బాలుడి బొమ్మని తయారు చేసింది. ఆ బొమ్మ మహాదేవుని స్నానపుతో నీరు ప్రాణం పోసుకుంది. మరొక పురాణాల ప్రకారం గజాననుడు కార్తీకుడి కంటే పెద్దవాడు. కాబట్టి అతనిని అగ్ర గజానన అని కూడా అంటారు. తారకాసుర హింస నుండి మునులను, ఋషులను, ప్రపంచంలోని సాదు జీవులను రక్షించడానికి శివపార్వతులు విఘ్నేశ్వరుడిని సృష్టించారు.

Vinayaka Chaviti 2024: విఘ్నాలకధిపతి వినాయకుడి జననం.. పురాణాల ప్రకారం తెలియని కొన్ని విశేషాలు ఏమిటంటే..
Vinayaka Chaviti 2024 9
Follow us on

పార్వతీ నందనుడు, గణపతి, వినాయకుడు, లంబోదరుడు, అద్వైతస్వరూపుడు వంటి అనేక పేర్లతో గణేశుడిని పిలుస్తారు. మత్స్య , వామన పురాణం ప్రకారం ఒకప్పుడు పార్వతి గాత్రం నుంచి గజానునుడు బొమ్మని తయారు చేసింది. గంగ స్పర్శతో ఆ బాలుడి శరీరం ప్రాణం పోసుకుంటుంది. అందుకే గణేశుడిని ద్వైమాతుర (ఇద్దరు తల్లుల తనయుడు) అని కూడా పిలుస్తారు. అదే సమయంలో వామన పురాణం లో గణేశుడి జన్మ గురించి మరొక కథ ఉంది. సంతానం కావాలనే కోరికతో పార్వతీ దేవి పసుపుతో ఒక బాలుడి బొమ్మని తయారు చేసింది. ఆ బొమ్మ మహాదేవుని స్నానపుతో నీరు ప్రాణం పోసుకుంది. మరొక పురాణాల ప్రకారం గజాననుడు కార్తీకుడి కంటే పెద్దవాడు. కాబట్టి అతనిని అగ్ర గజానన అని కూడా అంటారు. తారకాసుర హింస నుండి మునులను, ఋషులను, ప్రపంచంలోని సాదు జీవులను రక్షించడానికి శివపార్వతులు విఘ్నేశ్వరుడిని సృష్టించారు. వినాయకుడు తారకాసురిడి నుంచి సంస్థ లోకాన్ని రక్షిస్తాడు.

శివ పురాణం ప్రకారం పార్వతీ దేవి ఒకసారి తన శరీరం నుంచి వచ్చిన మట్టిని తీసుకొని ఒక అద్భుతమైన బాలుడిని సృష్టించి ఆ బాలుడి శరీరంలోకి ప్రాణం పోసింది. ఆ తర్వాత గేటుకు కాపలాగా నియమించి నిద్రపోయింది. అప్పుడు మహాదేవుడు ఆ ప్రదేశానికి వచ్చి పార్వతీ దేవి నివాస ద్వారం వద్ద కాపలాగా ఉన్న బాలుడిని చూశాడు. శివుడిని పార్వతి దేవి వద్దకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు ఆ అబ్బాయి. శివుడికి కోపం వచ్చి బలవంతంగా పార్వతి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే బాలుడి వెళ్ళనివ్వకపోవడంతో శివుడు, శివ గణాలు బాలుడితో యుద్ధం చేసి ఓడిపోయారు. దీంతో శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో బాలుడి తలను వేరు చేశాడు. ఆ తలను భస్మం చేశాడు. నిద్రలేచిన పార్వతి దేవి తన కొడుకు పరిస్థితి చూసి శివుడిని వేడుకుంది. అప్పుడు పార్వతి దేవిని శాంతింపజేయడానికి బాలుడికి తిరిగి జీవం పోయాలని భావించారు. దీంతో బాలుడి తల ప్రాంతంలో మరొక తల అమర్చేందుకు మరొక తల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఒక ఏనుగు ఉత్తరం వైపు తల పెట్టి చచ్చి పడి ఉంది. దీంతో ఏనుగు మృతదేహం నుంచి తలను వేరు చేసి తీసుకొచ్చి వినాయకుడి శరీరానికి పెట్టి అతికించారు. శివుడు విఘ్నేశ్వరుడిని తన వంశానికి అధిపతిగా చేసుకున్నాడు. అంతేకాదు పార్వతీ దేవి కోరిక మేరకు గణేశుడు దేవతలందరిలో మొదటిగా పూజించే ఆధిపత్యం అందుకున్నాడు.

  1. మహాభారత రచన: మహాభారతానికి మూల రచయిత గణేశుడు. తాను పలికే ప్రతి మాటకు అర్థాన్ని గణేశుడు మాత్రమే అర్థం చేసుకోగలడని వ్యాస మహర్షి అర్థం చేసుకున్నాడు. దీంతో తాను చెప్పే ప్రతి పంక్తి అర్ధాన్ని అర్థం చేసుకుని.. దానిని వ్రాయమని అభ్యర్థించాడు.
  2. గణేశుడికి భార్యలు: వినాయకుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు.. సిద్ధి (అభివృద్ధి దేవత), బుద్ధి (మేధస్సు యొక్క దేవత). అదే సమయంలో దక్షిణ భారతదేశంలో గణేశుడు బ్రహ్మచర్యం పాటించాడని నమ్ముతారు.
  3. తులసి శాపం: పురాణ కథనం ప్రకారం గజాననుడు ఒకానొక సమయంలో గంగానది ఒడ్డున కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో తులసి దేవి ధ్యానంలో ఉన్న గణేశుడిని ఇష్టపడింది. అతని రూపం ఆమెను ఆకర్షించింది. అతనిని వివాహం చేసుకోవాలనుకుంది. పదే పదే అభ్యర్థన చేసినప్పటికీ తులసి దేవి ప్రతిపాదనకు గణేశుడు అంగీకరించలేదు. అప్పుడు తులసి దేవి గణేశుడిని రెండు పెళ్లిళ్లు చేసుకుంటావని శపించింది! విసుగు చెందిన గణేశుడు ఆమెకు రాక్షసుడితో వివాహం జరుగుతుందని శపించాడు.
  4. వినాయక చతుర్థి నాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదంటే: గణేశుడు చాలా ప్రశాంతమైన దేవుడు. అయితే ఆగ్రహం వస్తే అడ్డుకోవడం కష్టం. చంద్రుడు ఒకప్పుడు గణేశుడిని కడుపు ఆకారం గురించి వెక్కిరించాడని చెబుతారు. ఫలితంగా వినాయక చవితి రోజున చంద్రుడిని చూసేవారికి చెడ్డపేరు వస్తుంది, నీలప నిందలు పడాల్సి ఉంటుందని గణేశుడు చంద్రుడిని శపించాడు!
  5. బౌద్ధమతంలో గణపతి: బౌద్ధులు కూడా గణేశుడిని పూజిస్తారు. బౌద్ధమతంలో గణేశుడిని వినాయకుడిగా కొలుస్తారు. అందువల్ల టిబెట్, చైనా , జపాన్లలో గణేశుడిని పూజిస్తారు.
  6. జపాన్ లో వినాయకుడు: జపాన్‌లోని ఆరాధ్య దైవం కాంగీటెన్ లక్షణాలు, రూపం మన గణేశుడికి చాలా సారూప్యతలు ఉన్నాయి. గణేశుడిని జపాన్‌లో ‘గణబాచి , గణబా’ అని పూజిస్తారు.
  7. ఇండోనేషియా కరెన్సీపై గణేశుడు: ఇండోనేషియా దేశ కరెంసిపై గణపతి చిత్రం ఉంటుంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు