Vidura Niti: జీవితంలో సక్సెస్, సంతోషం కావాలంటే… విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి..

|

Jan 09, 2025 | 7:38 PM

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో కొంత మంది తమ స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకుంటారు. అంతే కాదు అందరి ముందు తాము మంచిగా కనిపించేందుకు మంచితనం అనే ముసుగులు వేసుకుంటారు. అయితే ఈ ముసుగులు ఏదోక రోజు తొలగి పోతాయి. అయితే ఇలాంటి స్వార్ధ పరులకు దూరంగా ఉంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. విదురుడు చెప్పినట్టు ఈ గుణాలు అలవరచుకున్న మనిషి జీవితం ఆనందంగా ఉంటుంది.

Vidura Niti: జీవితంలో సక్సెస్, సంతోషం కావాలంటే... విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి..
Vidura Neeti In Telugu
Image Credit source: social media
Follow us on

ప్రతి మనిషిలో మంచి, చెడు అనే రెండు లక్షణాలు ఉంటాయి. ఐతే కాలక్రమేణా ఒక వ్యక్తి నిజమైన లక్షణాలు బయటకు వస్తాయి. మనిషిలో ఉండే కొన్ని గుణాలు ఆనందానికి దారితీస్తాయని విదురుడు తన నీతిలో పేర్కొన్నాడు. ఈ ఐదు గుణాలు ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. కనుక ప్రతి వ్యక్తీ ఆనందంగా ఉండడం కోసం కొన్ని మంచి గుణాలు అలవర్చుకోవాలని సూచించాడు విదురుడు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

సానుకూల ఆలోచన: మనం ఆలోచించే విధానం కూడా మన ఆనందానికి దారి తీస్తుంది. మన ఆలోచనలు సానుకూలంగా ఉన్నా.. మన చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నా సానుకూల ప్రభావం ఉంటుంది. అయితే నిర్లక్ష్యం, సోమరితనం, కోపం, దురాశ, భయం, మద్యపానం, అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఇలాంటి అలవాట్లు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం కూడా ఆనందంగా జీవించేలా చేస్తుంది. చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు జీవితంలో ముందుకు సాగలేరు. కనుక జీవితం సుఖంగా ప్రశాంతంగా సాగిపోవాలంటే కొన్ని అలవాట్లకు, కొంత మందికి దూరంగా ఉండాల్సిందే.

క్షమాగుణం, దానగుణం: గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి సాంగత్యం కల్పవృక్షం లాంటిది. విదురుడు చెప్పినట్లు క్షమాగుణం, దయాద్ర హృదయం కలవారు లోకంలో గొప్పవారు. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నా వారి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరి చుట్టూ ఉన్నా వారి జీవితం సరైన దిశలో సాగుతుంది. జీవితాన్ని మధురంగా మార్చుకోవడానికి, ఈ లక్షణాలు ఉన్నవారితో స్నేహం చేయండి లేదా ఈ లక్షణాలను మీరు కూడా అలవర్చుకోండి.

ఇవి కూడా చదవండి

పెద్దల పట్ల గౌరవం: ప్రతి ఒక్కరి జీవితంలో పెద్దల పాత్ర చాలా ముఖ్యమైనది. పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. కర్తవ్యం. పెద్దలకు సేవ చేయడం, పెద్దలను సన్మానించడం వల్ల ఇళ్లలో ఆనందం, శాంతి నెలకొంటాయి. అటువంటి ఇల్లు ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉంటుంది. పెద్దలను గౌరవించని ఇల్లు దుఃఖంతో నిండిపోతుందని విదురుడు చెప్పాడు.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం : విదురుడు తన నీతిశాస్త్రంలో ఇంటి పరిశుభ్రత గురించి ప్రస్తావించాడు. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత లేని ఇల్లు పేదరికంతో నిండి ఉంటుంది. లక్ష్మీదేవి కూడా శుభ్రమైన ఇంట్లో నివసిస్తుంది. అక్కడ సుఖ శాంతులు నెలకొంటాయి. కనుక ప్రతి ఒక్కరూ ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని విదురుడు సూచించాడు.

భగవంతునిపై నమ్మకం: విదుర నీతి ప్రకారం ఎవరైనా తమ పనిని భగవంతునిపై నమ్మకంతో ప్రారంభించాలి. అప్పుడు జీవితంలో విజయం సాధిస్తారు. అయితే కొందరు మాత్రం తామే ఉన్నతులమని.. తమ గురించి తామే చెప్పుకుంటూ గర్వపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదురుడు తన నీతిలో నిజాయితీగా పని చేస్తే జీవితంలో సంతోషం నిండి ఉంటుందని చెప్పాడు

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.