జ్యోతిష్యం ఒక వ్యక్తి ఎదుర్కొనే అనేక దోషాల గురించి చెబుతుంది. ఎవరైనా జన్మించిన సమయంలో గ్రహాలు, నక్షత్రాల స్థానం కారణంగా.. అతను ఏదో ఒక దోషంతో బాధపడుతూ ఉంటాడని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అయితే ప్రతి దోషానికి కష్టాలు పడాల్సిన అవసరం ఉండదు. జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న దోషాలలో ఒకటి వాసుకి కాల సర్ప దోషం. వాసుకి కాల సర్ప దోషం ఎప్పుడు వస్తుంది? అది ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం..అలాగే ఈ దోష నివారణ కోసం చేయాల్సిన చర్యలు ఏమిటంటే..
ఎవరి జాతకంలోనైనా మూడవ ఇంట్లో రాహువు, తొమ్మిదవ ఇంట్లో కేతువు ఉన్నప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే ఈ కాలంలో రాహు, కేతువుల మధ్య అన్ని శుభ, అశుభ గ్రహాల ఉనికి అవసరం. ఎవరికైనా వాసుకి కాలసర్ప దోషం ఉందా లేదా అనేది జ్యోతిష్యుడిని సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ దోషం ఉంటే అన్నదమ్ములకలహాలు, సమస్యలు, బందువుల వలన సమస్యలు ఎక్కువగా వుంటాయి. ఉద్యోగాల్లో బాధలు, పదోన్నతిలో ఆటంకాలు, ఉద్యోగం పోవడం వంటి అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక వాసుకి కాల సర్ప దోషం
తొలగిన తర్వాతే మనిషి జీవితంలో సంతోషం వస్తుంది.
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం వాసుకి కాలసర్ప దోషంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంలో చాలా కష్టపడతాడు. అతని కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. విద్యార్ధులు త్వరగా విజయం సాధించలేడు. చాలా వరకు అసంతృప్తిగా జీవిస్తూ ఉంటాడు. వాసుకి కాలసర్ప దోషంతో బాధపడుతున్న వ్యక్తికీ జీవితంలో త్వరగా విజయం సాధించలేరు. మొత్తంమీద ఈ దోషం శుభప్రదంగా పరిగణించబడదు.
వాసుకి కాలసర్ప దోషంతో బాధపడేవారు హనుమాన్ చాలీసా చదవాలని జ్యోతిష్యులు నమ్ముతారు. అలాగే ప్రతి మంగళవారం ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి. అంతే కాదు రాహు, కేతువుల బీజ మంత్రాన్ని జపించాలి. రోజూ శివుని పూజించాలి. శివాలయంలో శివుడిని ఆరాధించడం, ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఈ దోషం నుంచి విముక్తి పొందుతాడని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.