Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గణపతి, లక్ష్మీ దేవి విగ్రహాలు ఇంట్లో ఉండటం శుభ సూచికం. ఈ దేవుళ్ల విగ్రహాలు, చిత్ర పటాలను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. శాస్త్రాల ప్రకారం ఇంట్లోని ఆలయంలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల విశేష ప్రయోజనాలు ఉంటాయి. సంపదలు సిద్ధిస్తాయి. లేదంటే అనేక సమస్యలు తెలెత్తుతాయి. గణేషుడు, లక్ష్మీ దేవి విగ్రహాలు, చిత్రపటాలను ఏ దిశలో ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
గణేశుడు, లక్ష్మి దేవి విగ్రహాలను ఓకే చోట ఉంచాలి..
హిందూ మత గ్రంధాల ప్రకారం.. గణేషుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. లక్ష్మీ దేవి సంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే ప్రతీ హిందువు ఇళ్లలో లక్ష్మీ దేవి, గణేషుడి విగ్రహాలు, చిత్రపటాలు తప్పనిసరిగా ఉంటాయి. దీపావళి, అక్షయ తృతీయ వంటి ప్రత్యేక శుభ సందర్భాలలో ఈ ఇద్దరు దేవతను కలిపి పూజిస్తారు. జ్ఞానం లేకపోతే, డబ్బును దుర్వినియోగం చేస్తారు. అందుకే.. జ్ఞానాన్ని ప్రాసదించే గణేషుడి పక్కనే, సంపదలు ఇచ్చే లక్ష్మీదేవిని నెలకొల్పుతారు.
ఇంట్లోని గుడిలో గణేషుడు, లక్ష్మీ దేవి విగ్రహాలను ఇలా ఉంచాలి..
ఆలయంలో గణేషుడు, లక్ష్మీ దేవి విగ్రహాలు ఒకేచోట ఉంచుతారు. పురాణాల ప్రకారం గణేషుడు, మాతా లక్ష్మీ దేవి విగ్రహాలను ఉత్తరం వైపున ఉంచాలి. ఇలా ఉత్తరం వైపున ఉంచడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని విశ్వాసం.
ఇలా ఎప్పుడూ చేయొద్దు..
చాలా మంది గణేషుడు, లక్ష్మీ దేవి గురించి తెలియక.. పెద్ద పొరపాటు చేస్తుంటారు. లక్ష్మీ దేవి విగ్రహాన్ని వినాయకుడి ఎడమ వైపున పెడతారు. అలా చేయడం మహా పాపంగా పరిగణిస్తారు. దీని వల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పరుషులకు ఎడమైవపున వారి భార్యలు కూర్చుకుంటారు. లక్ష్మీ దేవి, వినాయకుడు మధ్య సంబంధం తల్లి కుమారుడు సంబంధం. అలాంటిప్పుడు వినాయకుడి ఎడవైపున లక్ష్మీదేవిని ఎట్టి పరిస్థితిలో నెలకొల్పొద్దు. పొరపాటున అలా చేస్తే.. అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. లక్ష్మీ దేవి విగ్రహాన్ని వినాయకుడి కుడివైపున ఉంచాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..