- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu: if you want to get rid of sorrow then always remember this thing of acharya chanakya
Chanakya Niti: మీరు జీవితంలో దుఃఖం బారిన పడకుండా ఉండాలంటే.. ఈ విషయాలను పాటించమంటున్న చాణక్య
Chanakya Niti: జీవితంలో, ప్రతి వ్యక్తి బాధల గురించి ఆందోళన చెందుతాడు. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో మనిషి బాధలకు పరిష్కారం చెప్పడమే కాదు.. జీవితంలోని అడుగడుగునా మీకు సహాయపడే అనేక ఇతర విషయాలు చెప్పాడు.
Updated on: Aug 06, 2022 | 5:27 PM

తప్పుడు నిర్ణయాల తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు - తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను దూరం ఉంచండి. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ముందు నుంచి ప్రోత్సహిస్తారు. వెనుక నుంచి మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.

స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

అసూయ: కోపంలా అసూయ కూడా మనిషికి అతి పెద్ద శత్రువు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అసూయ మనిషిని ముందుకు సాగనివ్వదు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ తనతో పాటు, ఇతరుల విజయానికి కూడా అడ్డుగా ఉంటాడు.

ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.

దొంగిలించబడిన డబ్బు - దొంగతనం చేసి.. సంపాదించిన డబ్బు లేదా తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బులు వ్యక్తి వద్ద ఎక్కువ కాలం ఉండదు. అలాంటి సంపాదనకు విలువ ఉండదు.. అటువంటి వ్యక్తిని ఎవరూ గౌరవంగా చూడరు. కనుక దొంగతనం చేసి డబ్బు సంపాదించకండి.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షులకు ఉండే కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ పక్షుల నుంచి మనిషి లక్షణాలను స్వీకరించడం ద్వారా.. ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఒక వ్యక్తి ఏయే పక్షులలో ఏయే లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం.




