Vastu Tips: ఈ చెడు అలవాట్లు జీవితంలో పురోగతిని అడ్డుకుంటాయి.. ఎవరైనా సరే ఇబ్బందులు ఎదుర్కోవల్సిందే..

జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యలు తగ్గకపోతే.. వెంటనే జీవితంలో దుఃఖానికి,దురదృష్టానికి ప్రధాన కారణం అయ్యే కొన్ని అలవాట్లను వదులుకోవాలి. మనిషి ఏ అలవాట్ల వల్ల జీవితంలో రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందో తెలుసుకుందాం..ఇంట్లో బాత్రూమ్‌ను ఎప్పుడూ మురికిగా ఉంటే.. వెంటనే ఈ అలవాటును మార్చుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వలన రాహు-కేతువుల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మురికి బాత్రూమ్ కారణంగా వ్యక్తి తన జీవితంలో ఆకస్మిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Vastu Tips: ఈ చెడు అలవాట్లు జీవితంలో పురోగతిని అడ్డుకుంటాయి.. ఎవరైనా సరే ఇబ్బందులు ఎదుర్కోవల్సిందే..
Vastu Tips

Updated on: Jul 22, 2024 | 3:05 PM

హిందూ మతంలోని జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జన్మించిన వెంటనే తొమ్మిది గ్రహాల శుభ, అశుభ ప్రభావాలు ఆ వ్యక్తి చేసే పనులలో కూడా ప్రతిబింబిస్తాయి. జీవితంలో చాలాసార్లు, నవగ్రహాలకు సంబంధించిన ఇబ్బందుల కారణం వ్యక్తికి సంబంధించిన చెడు అలవాట్లు.. అన్ని నియమాలను విస్మరిస్తూ తన జీవనశైలిలో చేర్చుకుంటాడు. జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యలు తగ్గకపోతే.. వెంటనే జీవితంలో దుఃఖానికి,దురదృష్టానికి ప్రధాన కారణం అయ్యే కొన్ని అలవాట్లను వదులుకోవాలి. మనిషి ఏ అలవాట్ల వల్ల జీవితంలో రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందో తెలుసుకుందాం..

  1. బాత్రూమ్‌ను ఎప్పుడూ మురికిగా ఉంచవద్దు: ఇంట్లో బాత్రూమ్‌ను ఎప్పుడూ మురికిగా ఉంటే.. వెంటనే ఈ అలవాటును మార్చుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వలన రాహు-కేతువుల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మురికి బాత్రూమ్ కారణంగా వ్యక్తి తన జీవితంలో ఆకస్మిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
  2. దురదృష్టాన్ని తెచ్చే అలవాటు: చాలా మందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం అలవాటు. ఎవరికైనా ఈ చెడు అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే ఇలా చేసేవారు చంద్ర గ్రహానికి సంబంధించిన దోషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచుగా మానసిక ఒత్తిడికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో శరీరం, మనస్సు ఇబ్బందులను నివారించడానికి రాత్రి సరైన సమయంలో నిద్ర పోవడం, ఉదయం సరైన సమయంలో మేల్కొనడం అలవాటు చేసుకోవాలి.
  3. ఉమ్మివేసేటప్పుడు ఈ విషయాన్నీ గుర్తు పెట్టుకోండి: కొంతమందికి ఇంట్లో లేదా బయట ఎక్కడ బడితే అక్కడ ఉమ్మి వేసే అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఈ అలవాటు సమాజంలో కీర్తి, గౌరవం ప్రమాదంలో పడవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా, ఎక్కడైనా ఉమ్మివేయడం వల్ల వ్యక్తి జాతకంలో బుధ గ్రహం ప్రభావం చూపుతుంది. బుధ దోషం వల్ల వ్యక్తి ప్రతిష్ట ప్రమాదంలో పడుతుంది.
  4. సింక్‌లో ఖాళీ పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రి భోజనం చేసిన తర్వాత పాత్రలను ఎప్పుడూ సింక్‌లో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పెద్ద లోపంగా పరిగణించబడుతుంది. రాత్రి సమయంలో సింక్ లో ఖాళీ పాత్రలను ఉంచే వారిపై సంపద దేవత లక్ష్మి దేవి అనుగ్రహంగా ఉంటుందని.. వారి జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు కొరత ఉంటుందని చెబుతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. తిన్న తర్వాత ప్లేట్స్ శుభ్రం చేయకపోతే: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిన్న తర్వాత భోజనం చేసిన ప్రదేశంలో పాత్రలను వదిలివేసే వ్యక్తులు చంద్ర, శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిన్న తర్వాత మీ ప్లేట్‌ను తీసివేసి..అందులో చేతులు కడుక్కోకపోతే జీవితంలో అన్ని రకాల మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
  7. ఇంట్లో ఎండిన మొక్కలను ఉంచవద్దు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ ఎరువులు, నీరు పోసి మొక్కలకు సేవ చేయాలి. అయితే ఎండిన మొక్కలు ఇంట్లో ఉంటే బుధ గ్రహం ఎదుర్కోవల్సి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎండిన మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది.అటువంటి పరిస్థితిలో, వెంటనే దానిని ఇంటి నుండి తీసివేసి దాని స్థానంలో ఆకుపచ్చ మొక్కను నాటండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు