Vastu Tips: శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఆరోగ్యం, సిరిసంపదలు మీ సొంతం

సనాతన ధర్మం ప్రకృతితో ముడిపడి ఉంది. హిందూ మతంలో ప్రకృతే మనిషి జీవితానికి ఆధారం అని చెబుతారు. శరీరం కూడా పంచ భూతాలైన ఐదు అంశాలతో రూపొందించబడిందని నమ్ముతారు. అందుకనే సనాతన ధర్మంలో చెట్లు, మొక్కలు , పశువులు, పక్షులు ఇలా ప్రతి ఒక్కదానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే మొక్కలను పెంచుకోవడం విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. ఇంట్లో లోపల ఏ మొక్కలు పెంచుకోవాలి. ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలను పెంచుకోవాలి.. ఇంటి బయట, గ్రామంలో, రోడ్ల పక్కన ఇలా మొక్కలను పెంచే విషయంలో కొన్ని నియమాలున్నాయి. ఈ రోజు శ్రావణ మాసంలో ఇంటి ఆవరణలో ఏ మొక్కలు నాటితే అదృష్టమో తెలుసుకుందాం..

Vastu Tips: శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఆరోగ్యం, సిరిసంపదలు మీ సొంతం
Vastu Tips

Updated on: Jul 20, 2025 | 11:09 AM

జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం రెండూ ప్రకృతి శక్తిని జీవశక్తితో అనుసంధానిస్తాయి. అందుకే కొన్ని చెట్లు, మొక్కలను శుభప్రదంగా .. కొన్ని అశుభకరంగా భావిస్తారు. ఇదే విషయాన్నీ అనేక మత గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. జ్యోతిష్యం ప్రకారం చెట్లు, మొక్కలు కూడా గ్రహాలతో ముడిపడి ఉన్నాయి. చాలా చెట్లు, మొక్కలు గ్రహాల అశుభ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. మరికొన్ని శుభాన్ని పెంచడానికి పనిచేస్తాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు మనం ఇంటి ప్రాంగణంలో పెంచుకునే 10 రకాల చెట్లు, మొక్కల గురించి తెలుసుకుందాం.. వీటిని ఇంట్లో లేదా ప్రాంగణంలో నాటితే ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇస్తాయి.

తులసి
సనాతన ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక హోదా ఇవ్వబడింది. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం అవసరమని నమ్ముతారు. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది.

మారేడు
మారేడు చెట్టులో శ్రీ మహాలక్ష్మి నివసిస్తుందని నమ్ముతారు. ఈ మొక్క సూర్యుని ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. ఈ మొక్కను ఇంటి పెరడులో పెంచుకోవడం వలన శివుని ఆశీస్సులు లభిస్తాయని కొందరు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఉసిరి చెట్టు
ఇంట్లో ఉసిరి చెట్టు పెంచుకోవడం కూడా శుభప్రదం అని విశ్వాసం. ఉసిరి మొక్క ఉన్న వ్యక్తి అన్ని కష్టాల నుంచి బయటపడతాడని నమ్ముతారు. ఈ చెట్టును ఇంటి ఆవరణలో లేదా ప్రాంగణంలో నాటవచ్చు.

జమ్మి మొక్క
జమ్మి మొక్క శనీశ్వర గ్రహంతో ముడిపడి ఉంది. జమ్మి మొక్కను నాటడం వల్ల శనీశ్వర గ్రహ ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. శమీ ఆకులతో శివుడికి పూజ చేస్తారు.

అశ్వగంధ
ఇంట్లో అశ్వగంధ మొక్కను నాటడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు భావిస్తున్నారు.

అశోక చెట్టు
అశోక చెట్టు ఆకులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇది ఇంట్లో మానసిక ప్రశాంతతను తెస్తుందని నమ్ముతారు. దీని ఆకులను ఉపయోగించి అనేక నివారణలు కూడా సూచించబడ్డాయి.

తెల్ల జిల్లేడు చెట్టు
తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. శివుడికి చాలా ప్రియమైనది. అంతేకాదు ఈ చెట్టులో విఘ్నాలకధిపతి వినాయకుడు నివసిస్తాడని విశ్వాసం.

మందార మొక్క
ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

అరటి చెట్టు
అరటి చెట్టులో విష్ణువు ,బృహస్పతి నివసిస్తున్నారని చెబుతారు. ఈ మొక్కను బృహస్పతి శుభ ప్రభావం కోసం నాటుతారు. దీనిని సంపద , శ్రేయస్సును అందించే మొక్కగా కూడా పరిగణిస్తారు.

కుబేరాక్షి
ఈ మొక్క లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనదని చెబుతారు. ఇది సంపదను ఆకర్షించడంలో అయస్కాంతంలా పనిచేస్తుందని నమ్ముతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.