Vastu Tips: నెమలి ఈకను ఇంట్లో ఏ దిశలో ఎక్కడ డబ్బుకు ఇబ్బంది ఉండదో తెలుసా..!

|

Nov 23, 2024 | 5:32 PM

నెమలి ఈకకు హిందూ మతపరమైన కోణంలోనే కాదు జ్యోతిష్యం పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెమలి ఈకలను హిందూ సంస్కృతిలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పండుగల సమయంలో తరచుగా అలంకార వస్తువులుగా వాడతారు. అంతేకాదు నెమలి ఈకలతో ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. అయితే ఇంట్లో ఎప్పుడూ విరిగిన నెమలి ఈకలను ఉపయోగించకండి.

Vastu Tips: నెమలి ఈకను ఇంట్లో ఏ దిశలో ఎక్కడ డబ్బుకు ఇబ్బంది ఉండదో తెలుసా..!
Vastu Tipf For Peacock
Follow us on

పురాణ గ్రంధాల ప్రకారం హిందూ మతంలో దేవుళ్లను మాత్రమే కాదు పశు పక్ష్యాదులను దైవంగా భావించి పూజించే సంప్రదాయం ఉంది. అదే సమయంలో కొన్ని జంతువులు, పక్షులు దేవతలకు వాహనాలు కూడా. అలాంటి వాహనాల్లో నెమలి ఒకటి. ఈ అందమైన పక్షి ఈక శ్రీ కృష్ణుడు అలంకరణలో ఒక ముఖ్యమైన భాగం. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

  1. ఇంట్లో మీ పూజా గదిలో రెండు నెమలి ఈకలను కలిపి ఉంచడం వల్ల వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు.
  2. ఇంటి ప్రధాన ద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వంటి శుభ దిశలో లేకుంటే లేదా ప్రధాన ద్వారంలో మరేదైనా వాస్తు దోషం ఉన్నట్లయితే తలుపు ఫ్రేమ్‌పై కూర్చున్న భంగిమలో గణేశుడిని ప్రతిష్టించండి. ఆ వినాయకుడి బొమ్మపై మూడు నెమలి ఈకలు పెట్టండి.
  3. ఆర్ధిక సమస్యలు తొలగిపోవాలంటే శుక్ల పక్షంలో ఆగ్నేయ మూలలో కనీసం 5 అడుగుల ఎత్తులో రెండు నెమలి ఈకలను పెడితే ఆర్ధిక సమస్యలు తీరుతాయి.
  4. ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లో 11, 15 లేదా అంతకంటే ఎక్కువ నెమలి ఈకలను ఉంచడం వల్ల పరస్పర సామరస్యం మెరుగుపడుతుందని..కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను కొనసాగించవచ్చని నమ్ముతారు.
  5. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణాన్ని అందించడంలో నెమలి ఈకలు కూడా సహాయపడతాయి. నెమలి ఈకలు పెట్టిన ప్రాంతలో ఎలాంటి క్రిములు రావు.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.