AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా? స్నానం నీటిలో వీటిని కలిపి చేస్తే అదృష్టం మీవెంటే

మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. ఇందుకు వాస్తుశాస్త్రం కొన్ని చిట్కాలు సూచిస్తోంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో డబ్బు నిలవకపోతే.. మీరు కొన్నింటిని నీటిలో కలిపి వాటితో స్నానం చేస్తే అది మీ ఇంట్లోని వాస్తు దోషాలను తొలగిస్తుంది. అంతేగాక, మీ డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. వాస్తుశాస్త్రంలో చెప్పబడిన ఆ వస్తువులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips: మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా? స్నానం నీటిలో వీటిని కలిపి చేస్తే అదృష్టం మీవెంటే
Bath
Rajashekher G
|

Updated on: Jan 18, 2026 | 10:19 AM

Share

Vastu Shastra: వాస్తుశాస్త్రం అనేది మానవ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సులభమైన పరిష్కారాలను చూపుతుంది. మన జీవితంలో అతిపెద్ద సమస్య అంటే అవసరాలకు కూడా డబ్బు లేకపోవడమే. మనం తరచుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటాం. ఎంత కష్టపడినా.. డబ్బు అవసరాలకు సరిపడా డబ్బు రాదు. డబ్బు వచ్చినా అది మన వద్ద నిలువదు. చేతిలో డబ్బు ఉండకపోవడానికి అనేక కారణాలున్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో వాస్తు లోపం ఉన్నప్పుడు.. మీరు కూడా అలాంటి సమస్యలను అనుభవించడం ప్రారంభమవుతుంది. మీ ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడానికి వాస్తు శాస్త్రం అనేక సులభమైన పరిష్కారాలను అందించింది.

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో డబ్బు నిలవకపోతే.. మీరు కొన్నింటిని నీటిలో కలిపి వాటితో స్నానం చేస్తే అది మీ ఇంట్లోని వాస్తు దోషాలను తొలగిస్తుంది. అంతేగాక, మీ డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. వాస్తుశాస్త్రంలో చెప్పబడిన ఆ వస్తువులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సైంధవ లవణం

ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించడానికి సైంధవ లవణం(సైంధవ ఉప్పు) ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుంది. మీరు ప్రతిరోజూ మీ స్నానపు నీటిలో కొద్దిగా సైంధవ ఉప్పును జోడించి ఆ నీటితో స్నానం చేస్తే మీ ఇంట్లోని అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇది అన్ని రకాల దుష్ట శక్తుల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

బిర్యానీ ఆకు/తేజ పత్త

బిర్యానీ ఆకు అనేది కేవలం సుగంధ ద్రవ్యమే కాదు.. వాస్తు శాస్త్రంలో కూడా దీనికి అనేక నివారణలను కలిగి ఉంది. స్నానపు నీటిలో బిర్యానీ ఆకును జోడించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల అన్ని ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇది ఇంటికి ఆర్థిక ఆశీర్వాదాలను తెస్తుందని శాస్తుశాస్త్రం కూడా చెబుతోంది.

లవంగాలు

లవంగాలు ఆయుర్వేద ఉపయోగాలు చాలా ఉన్నాయి. కానీ, అదే సమయంలో వాస్తు శాస్త్రంలో అనేక ప్రయోజనాలు ప్రస్తావించబడ్డాయి. మీరు ప్రతిరోజూ మీ స్నానపు నీటిలో ఒక లవంగాన్ని జోడించి దానితో స్నానం చేస్తే అది అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. ప్రతికూలతలు తొలగిపోతాయి.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు ధృవీకరించదు.)