వాస్తు ప్రకారం.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు , శాంతి కోసం సరైన దిశలో పనిచేయడం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు, కష్టపడి, అంకిత భావంతో పనిచేసినా మనకు కావాల్సిన సక్సెస్ లభించదు. దీని వెనుక వాస్తు దోషం ఉండవచ్చని సూచిస్తున్నారు. ఇంట్లో అతి ముఖ్యమైన భాగం వంటగదిగా పరిగణించబడుతుంది. మీ వంటగదిలో ఏదైనా వాస్తు దోషం ఉంటే.. అది అనేక వ్యాధులు, సమస్యలను కలిగిస్తుంది. వాస్తు ప్రకారం మీరు కూర్చొని భోజనం చేసే దిశలో లోపం ఉండవచ్చు. వంట చేయడం తో పాటు తినడానికి సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం..
ఏ దిశలో తినాలంటే..
ఆహరం తినే సమయంలో దిక్కులు చూస్తూ.. గంటలు గంటలు సమయం తీసుకుని తింటే శారీరక సమస్యలు తప్పవని నమ్ముతారు. వాస్తు ప్రకారం, తూర్పు దిశలో ఆహారం తీసుకోవడం ద్వారా.. మీ శరీరం , మనస్సు ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయి. మరోవైపు, ఉత్తర దిశలో ఆహారం తీసుకోవడం సంపదను కలిగిస్తుంది. చదువుకునే పిల్లలు ఉత్తరం దిక్కున భోజనం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
నేలపై ఆహారం తినండి
మీరు తినే ఆహారాన్ని గౌరవించాలనుకుంటే, ఎల్లప్పుడూ నేలపై కూర్చొని తినాలని పెద్దల విశ్వాసం. ప్రస్తుతం నేటి తరం యువత తరచుగా డైనింగ్ టేబుల్‌పై లేదా బెడ్‌పై కూర్చొని తింటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక, శారీరక సమస్యలు వస్తాయి. పురాతన కాలంలో కూడా ప్రజలు నేలపై కూర్చొని ఆహారాన్ని తినేవారు, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
అతిథులకు ఏ దిశలో ఆహారం ఇవ్వాలంటే
వాస్తు ప్రకారం ఇంటికి అతిథి వచ్చినప్పుడల్లా వారిని దక్షిణం లేదా పడమర ముఖంగా కూర్చోబెట్టాలి. అతిథులకు ఆహారం పెట్టె ముందు దేవునికి నైవేద్యం సమర్పించి.. అనంతరం అతిథులకు ఆహారం అందించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవి ప్రసన్నురాలవుతుందని, ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం.
వంట చేసేటప్పుడు గుర్తుంచుకోవాలిన విషయాలు
వాస్తు ప్రకారం, వంటగదిలో ఆహారాన్ని తయారుచేసేటప్పుడు, మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. దీంతో ఇంట్లోని సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. అదే సమయంలో, ఆహారాన్ని నైరుతి దిశలో వండినట్లయితే, అది ఇంట్లో అసమ్మతికి కారణం అవుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)