చాలా మంది వాస్తు శాస్త్రంపై శ్రద్ధ పెట్టకుండానే తెలియకుండానే ఇంటిని నిర్మించుకుంటారు. దాని కారణంగా కొన్ని వాస్తు లోపాలు ఉంటాయి. వాస్తు శాస్త్రాన్ని విస్మరించి కట్టుకున్న ఇంట్లో నివసించేవారి జీవితం ఆటంకాలు, సమస్యల వల్ల జీవితం అస్తవ్యస్తమవుతుంది. వాస్తు శాస్త్రం గురించి తెలియని వారు చాలామంది ఉంటారు, వారు తరచుగా వాస్తు దోషాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తు దోషాలు జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి. ఇంట్లో లేదా కొన్నిసార్లు ఇంటి బయట కూడా అనేక రకాల వాస్తు దోషాలు ఉంటాయి.
వాస్తు శాస్త్రం ప్రాముఖ్యత
- వాస్తు దోషాల వల్ల ఇంట్లో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని పడగొట్టి పునర్నిర్మించాలని ఆలోచిస్తున్నట్లయితే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే డబ్బు ఖర్చు లేకుండా ఇంటి వాస్తు శాస్త్రాన్ని సరిదిద్దడానికి కొన్ని ప్రభావవంతమైన మార్గాల గురించి ఈ రోజు మేము మీకు తెలియజేస్తాము. వీటిని మీరు అవలంబించడం ద్వారా మీ ఇంటిలోని వాస్తు దోషాలను సరిదిద్దవచ్చు. సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపవచ్చు.
- ఇంటిలోని వాస్తు దోషాలను తొలగించాలనుకుంటే.. ఇంట్లో అన్ని వస్తువులను క్రమబద్ధంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇల్లు త్రిభుజాకారంలో, మూలలో లేదా కూడలిలో లేదా దక్షిణ దిశలో ఉన్నట్లయితే.. అటువంటి ఇంటి వాస్తు దోషాలను తొలగించడానికి, ఇంటి పునర్నిర్మాణం లేదా ఇంట్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాలి. ఆనందం, శాంతి, సంపద, శ్రేయస్సు కావాలంటే ఇంటి శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం అవసరం.
- వాస్తు దోషాలకు పరిహారాలు
- ప్రతికూల శక్తులను నివారించడానికి, ఇంట్లో ప్రతిదీ క్రమంలో ఉంచండి. ఇంట్లోని వస్తువులను క్రమబద్ధంగా ఉంచడం వల్ల ఇంట్లోని వారందరికీ ఆరోగ్యం బాగుంటుంది.
- వాస్తు శాస్త్రంలో స్వస్తిక్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ చిహ్నాన్ని ఏర్పాటు చేసుకోండి. దీనివలన ప్రతికూల శక్తి అంతమై, వాస్తుదోషం కూడా తగ్గుతుంది. అంగారక గ్రహ దోషాలు కూడా తొలగుతాయి.
- వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు శుభ్రంగా కాంతితో నిండి ఉండటం చాలా ముఖ్యం. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ఇంటి వాయువ్య మూలలో దీపం వెలిగించండి.
- మీ ఇంటి ఆనందం, మెరుగైన జీవితం కోసం మొత్తం నాలుగు దిక్కుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
- ఇంటి ఈశాన్య మూలలో ఎగిరే పక్షులు, ఉదయించే సూర్యుడు లేదా నదుల చిత్రాన్ని ఉంచండి.
- వంటగదిలోని అగ్ని మూలలో ఎర్రటి బల్బు ఉంచండి. ఇలా చేయడం వల్ల వంటగదిలోని వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
- ఇంట్లోని అగ్నిసంబంధించిన మూలలో గణేశుడి బొమ్మ లేదా విగ్రహాన్ని ఉంచడం ద్వారా సంపద, శ్రేయస్సుకు లోటు ఉండదు.
- ఇంటి అగ్ని కోణం దిశలో మనీ ప్లాంట్‌ను నాటండి. ఇది ఉద్యోగం లేదా వ్యాపారంలో గొప్ప విజయాన్ని ఇస్తుంది.
- ఇంట్లో ఈశాన్య దిక్కున ఉన్న నీరు మాత్రమే త్రాగాలి.
- ఇంట్లో పాడైన గడియారాలు ఉండడం అశుభం, కాబట్టి ఇంట్లో పడి ఉన్న గడియారాలను ఇంటి నుండి తీసివేయండి లేదా వాటిని మరమ్మతు చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)