Vastu Tips: మానసిక ప్రశాంతత కావాలా.. అయితే ఇంట్లో ఈ మార్పులు చేయండి!

ఉదయం లేచింది మొదలు.. బిజీ బిజీగా లైఫ్ సాగుతుంది. పల్లెటూర్లు అయినా పట్నాలైనా ప్రస్తుతం ఎవరి పనులు వాళ్లవే అయ్యాయి. ఒత్తిడి లేకుండా ఏ పనీ ఉండటం లేదు. ఇలా బయటకు వెళ్లాక అనేక టెన్షన్స్ ఉంటాయి. తిరిగి ఇంటికి వచ్చాక కూడా వాటి ఒత్తిడి కాస్తైనా కనిపించక మానదు. కానీ వాటిని పక్కకు పెట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు. కానీ కొందరి ఇళ్లల్లో అది కరువు అవుతుంది. దీంతో భార్య భర్తల మధ్యల మనస్పర్థలు, గొడవలు ఇలా..

Vastu Tips: మానసిక ప్రశాంతత కావాలా.. అయితే ఇంట్లో ఈ మార్పులు చేయండి!
Vastu Tips

Updated on: Jan 23, 2024 | 3:55 PM

ఉదయం లేచింది మొదలు.. బిజీ బిజీగా లైఫ్ సాగుతుంది. పల్లెటూర్లు అయినా పట్నాలైనా ప్రస్తుతం ఎవరి పనులు వాళ్లవే అయ్యాయి. ఒత్తిడి లేకుండా ఏ పనీ ఉండటం లేదు. ఇలా బయటకు వెళ్లాక అనేక టెన్షన్స్ ఉంటాయి. తిరిగి ఇంటికి వచ్చాక కూడా వాటి ఒత్తిడి కాస్తైనా కనిపించక మానదు. కానీ వాటిని పక్కకు పెట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు. కానీ కొందరి ఇళ్లల్లో అది కరువు అవుతుంది. దీంతో భార్య భర్తల మధ్యల మనస్పర్థలు, గొడవలు ఇలా ఉంటూ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే.. వాస్తు ప్రకారం కొన్ని మార్పులు ఖచ్చితంగా చేయాలని నిపుణులు అంటున్నారు. భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వాతావరణానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇంటి లే అవుట్, మనం ఉపయోగించే వస్తువుల వల్ల కూడా మన జీవితాలపై ప్రభావం పడుతుంది. ఇంట్లో మానసిక ప్రశాంతత నెలకొనాలంటే.. కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

* ఇంట్లో అమెథిస్ట్ లేదా రోజ్ క్వార్ట్జ్ వంటివి ఉంచడం చాలా మంచిది. ఇవి ఇంటి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అప్యాయతను పెంచుతాయి. కొన్ని రకాల రాళ్లకు వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. పద్మ రాగాన్ని ఇంట్లో ఉంచడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

* ఇంట్లో సహజంగా కాంతి వచ్చేలా ఉండాలి. సూర్య కాంతి, స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లోకి గాలి, వెలుతురు తగలడం వల్ల పలు బ్యాక్టీరియా, వైరస్, కీటకాలు రాకుండా ఉంటాయి. ఇది మానసిక స్థితిని మెరుగు పరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. మంచి ప్రశాంతమైన నిద్ర కోసం బెడ్‌రూమ్‌లో ఈశాన్య దిశలో తల పెట్టి పడుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

* ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచే వస్తువులు ఎలాంటివీ ఉండకుండా చూసుకోవాలి. దీని వల్ల మానసిక ప్రశాంతత కరువు అవడమే కాకుండా.. ఇంట్లో గొడవలు, మనస్పర్థలు వంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

* ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచేలా చూసుకోండి. దీని వల్ల ఇంట్లోకి రాగానే ప్రశాంతంగా ఉంటుంది. ఇంటిని గందరగోళంగా ఉంచడం వల్ల మనసుపై కూడా నెగిటివ్ ఎనర్జీ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.