Vastu tips: వాస్తు దోషం.. ఇంట్లోని ఈ వస్తువులు మీ సంపద, గౌరవానికి అడ్డంకి..! ఈ రోజే తీసి పారేయండి..

|

Dec 05, 2023 | 7:17 AM

ఇంట్లో ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు ఎవరైనా ఉంటే.. కచ్చితంగా ఒక్కసారి ఇంటి వాస్తును, వాస్తు శాస్త్ర సిద్ధాంతికి చూపించుకోవాలని సలహా ఇస్తున్నారు. చాలా మంది ఇల్లు వాస్తు ప్రకారమే ఉందని, వాస్తు దోషం ఏమీ లేకున్నా ఇబ్బందులు పడుతున్నామని అంటుంటారు.. కానీ కచ్చితంగా ఇంట్లో కష్టాలు వాస్తు దోషాలు లేకుండా ఊరికనే రావని అంటున్నారు వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు. అంతే కాదు, ఇంట్లో తెలిసి తెలియక చేసే చిన్న తప్పిదాలు కూడా వాస్తు దోషానికి కారణం కావొచ్చు. అవేంటో తెలుసుకోవాలి..

Vastu tips: వాస్తు దోషం.. ఇంట్లోని ఈ వస్తువులు మీ సంపద, గౌరవానికి అడ్డంకి..! ఈ రోజే తీసి పారేయండి..
Vastu Tips
Follow us on

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చాలా డబ్బు, గౌరవం సంపాదించాలని కోరుకుంటారు. కానీ, కొందరికి ఈ కల కలగానే మిగిలిపోతుంది. వాస్తుకి సంబంధించిన చిన్న చిన్న పొరపాట్లు మీ ఆశయానికి అటంకం కలిగిస్తాయి. ఈ తప్పులు మీ శ్రేయస్సుకు అడ్డుపడుతుంటాయి. ఇంట్లో ధన ప్రవాహం నిలిచిపోతుంది. ఇంటి ఆనందం కూడా చెదిరిపోతుంది. అటువంటి పరిస్థితిలో మీరు చేస్తున్న ఆ చిన్న చిన్న తప్పులు ఏంటి..? వాటిని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకోవటం ఉత్తమం. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దోషాలు ఆర్థిక నష్టంతో సహా అనేక ఇతర సమస్యలకు దారితీస్తాయో జ్యోతిశాస్త్ర నిపుణుల సమాచారం మేరకు ఇక్కడ తెలుసుకుందాం..

పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, చదువులలో రాణించక పోవడం వాస్తు దోషంగానే చెబుతున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. అంతేకాదు.. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా కొందరు పిల్లలు పారిపోవటం వంటిది చేస్తుంటారు. చెడు స్నేహాలు, వ్యసనాల బారిన పడటం, కేసులలో ఇరుక్కోవడం కూడా వాస్తు దోషం వల్లేనని అంటున్నారు. ఇంట్లో ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు ఎవరైనా ఉంటే.. కచ్చితంగా ఒక్కసారి ఇంటి వాస్తును, వాస్తు శాస్త్ర సిద్ధాంతికి చూపించుకోవాలని సలహా ఇస్తున్నారు. చాలా మంది ఇల్లు వాస్తు ప్రకారమే ఉందని, వాస్తు దోషం ఏమీ లేకున్నా ఇబ్బందులు పడుతున్నామని అంటుంటారు.. కానీ కచ్చితంగా ఇంట్లో కష్టాలు వాస్తు దోషాలు లేకుండా ఊరికనే రావని అంటున్నారు వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు. అంతే కాదు, ఇంట్లో తెలిసి తెలియక చేసే చిన్న తప్పిదాలు కూడా వాస్తు దోషానికి కారణం కావొచ్చు. అవేంటో తెలుసుకోవాలి..

సంపదకు దేవత అయిన లక్ష్మి దేవితో చీపురు ముడిపడి ఉంటుంది. చీపురును తన్నడం, తప్పు స్థానంలో చీపురు ఉంచడం మంచిది కాదు..చీపురు తప్పుడు స్థానంలో ఉన్నట్టయితే.. దాని ప్రభావం వల్ల ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. చీపురును ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచరాదు. అది ఎవరి కంటా పడకుండా దాచి ఉంచాలి. అలాగే, విరిగిన, పగిలిపోయిన వంట పాత్రలను ఇంట్లో నిల్వ ఉంచడం వల్ల కూడా ప్రతికూల శక్తి పెరుగుతుంది. పనికిరాని వస్తువులు పేరుకుపోయిన ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పుడూ నివసించదు. అలాంటి ఇంట్లో ఇంటి సభ్యుల కృషి వృద్ధాగా మారుతుంది. పురోగతి ఉండదు. ఆదాయం పెరగదు.

ఇవి కూడా చదవండి

ఇంట్లోని సాలెపురుగులు ఎక్కువగా చేరినట్టయితే కూడా .. క్రమంగా ఆ ఇంట్లోని వారికి పేదరికానికి దారితీస్తాయి. అందువల్ల, ఇంట్లో సాలీడు అల్లుకోకుండా ఎప్పిటి కప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే, ఇంట్లో పక్షులు గూడు కట్టుకోవడం శ్రేయస్కరం. కానీ, ఇంట్లో పావురాల గూడు ఉండడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే పావురం సంబంధం రాహువుతో ముడిపడి ఉంటుందని జ్యోతి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అలాగే, ఇంట్లో ఎప్పుడూ ముళ్ల మొక్కలను పెంచుకోవటం శ్రేయస్కరం కాదు..దీని ఫలితంగా ఇంట్లో గొడవలు పెంచినట్టుగా అవుతంది.. దీనితో పాటు జీవితంలో అనేక ఇబ్బందులు, అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.