Vastu Tips: ఈ వస్తువులను పొరపాటున కూడా గిఫ్ట్ గా ఇవ్వకండి.. బంధాలు బీటలు పడతాయి..

సాధారణంగా ఇల్లు కట్టడానికి లేదా ఇంట్లో వస్తువులను అమర్చడానికి ముందు కొన్ని వాస్తు నియమాలను పాటిస్తారు. ఏదైనా కొత్త వస్తువు కొనడానికి మాత్రమే కాదు.. ఏదైనా నిర్దిష్ట వ్యక్తికి బహుమతి ఇచ్చే ముందు వాస్తు శాస్త్ర నియమాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొన్ని రకాల వస్తువులను పొరపాటున కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే బంధాలు తెగిపోతాయి. ఆ వస్తువులు ఏమిటంటే

Vastu Tips: ఈ వస్తువులను పొరపాటున కూడా గిఫ్ట్ గా ఇవ్వకండి.. బంధాలు బీటలు పడతాయి..
Vastu Tips

Updated on: May 15, 2025 | 10:35 AM

వాస్తు శాస్త్రం అనేది ఒక పురాతన జ్ఞానం, ఇది సైన్స్ , కళల మిశ్రమంగా చెప్పబడుతుంది. ఇది భవన నిర్మాణం నుంచి దానిలో నివసించేందుకు నియమాల వరకు ప్రతిదాని గురించి ప్రస్తావిస్తుంది. సాధారణంగా, ఏదైనా కొత్త వస్తువు కొనడానికి, ఇల్లు కట్టడానికి లేదా వస్తువులను అమర్చడానికి ముందు, ఈ నియమాలను పాటిస్తారు. ఇది మాత్రమే కాదు ఏదైనా నిర్దిష్ట వ్యక్తికి బహుమతి ఇచ్చే ముందు వాస్తు శాస్త్ర నియమాలను కూడా దృష్టిలో ఉంచుకుంటారు. నిజానికి ప్రత్యేక సందర్భాలలో ప్రియమైనవారికి బహుమతులు ఇచ్చే సంప్రదాయం శతాబ్దాల నాటిది. ఇది సంబంధాలలో ప్రేమ, నమ్మకాన్ని వ్యాపింపజేస్తుంది. మనుషులు బహుమతుల ద్వారా కూడా తమ భావాలను వ్యక్తపరుస్తారు. అయితే కొన్నిసార్లు, తెలిసి లేదా తెలియకుండా.. ఏదోకటి నచ్చింది బహుమతిగా ఇచ్చేస్తారు. ఇది సంబంధాలపై నేరుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో బంధాలు నిలవాలంటే బహుమతిగా ఇవ్వకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం..

  1. సాధారణంగా నలుపు రంగు వస్తువులు చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. అయితే ఈ రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వడం సముచితం కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం స్నేహితునికీ నల్ల రంగు బట్టలు, గడియారాలు, బూట్లు, చెప్పులు ఇవ్వకూడదు. ఇలాంటి వస్తువులను బహుమతిగా ఇవ్వడం వలన సంబంధాలలో దూరం ఏర్పడుతుంది.
  2. అందరికీ మంచి వాసన వచ్చేలా చేసే సువాసనగల పెర్ఫ్యూమ్. అందరూ ఈ పెర్ఫ్యూమ్ ని జల్లుకోవడానికి ఇష్టపడతారు. అయితే పెర్ఫ్యూమ్ ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు.
  3. వాస్తు ప్రకారం స్నేహితులకు మాత్రమే కాదు ఎవరికీ పర్స్ బహుమతిగా ఇవ్వకూడదు. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
  4. ముత్యం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీనిని ధరించిన తర్వాత ఆ ముత్యం అందం మరింత పెరుగుతుంది. అయితే ముత్యం కన్నీళ్లకు చిహ్నంగా భావిస్తారు. కనుక పొరపాటున కూడా ఎవరికీ ముత్యాలను బహుమతిగా ఇవ్వకూడదు.
  5. ఇవి కూడా చదవండి
  6. వాస్తు ప్రకారం చేతి రుమాలు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. జ్యోతిషశాస్త్రంలో దీనిని అశుభంగా భావిస్తారు. ఇది సంబంధాలను దెబ్బతీస్తుందని నమ్ముతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు