Vastu Tips: ఇంట్లో అక్వేరియాన్ని ఎక్కడ ఏ దిశలో పెట్టుకోవడం శుభం.. ఏ దిశలో పెట్టుకోవడం అశుభమో తెలుసుకోండి..

|

Jun 15, 2024 | 2:49 PM

అక్వేరియం ఇంట్లో పెట్టుకుంటే దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి అందుకు సంబంధించిన వాస్తు చిట్కాలను తప్పనిసరిగా అనుసరించాలి. ఈ రోజు ఇంట్లో అక్వేరియం ఎక్కడ ఏ దిశలో పెట్టుకోవడం వలన శుభ ఫలితాలు వస్తాయో జ్యోతిష్యులు సూచించిన సూచనలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం..వాస్తు ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో అక్వేరియం లేదా నీటికి సంబంధించిన ఏదైనా వస్తువులను లేదా ఏదైనా షో పీస్‌లను ఉంచవద్దని జ్యోతిష్కులు చెబుతున్నారు.

Vastu Tips: ఇంట్లో అక్వేరియాన్ని ఎక్కడ ఏ దిశలో పెట్టుకోవడం శుభం.. ఏ దిశలో పెట్టుకోవడం అశుభమో తెలుసుకోండి..
Fish Aquarium At Home
Follow us on

ప్రస్తుతం ఇంటికి అందం కోసం రకరకాల వస్తువులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా గృహాలంకరణ కోసం ఇంట్లో అక్వేరియం పెట్టుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఇంట్లో చేపల ను పెంచుకోవడానికి కూడా జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది. అందుకనే అక్వేరియం ఇంట్లో పెట్టుకుంటే దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి అందుకు సంబంధించిన వాస్తు చిట్కాలను తప్పనిసరిగా అనుసరించాలి. ఈ రోజు ఇంట్లో అక్వేరియం ఎక్కడ ఏ దిశలో పెట్టుకోవడం వలన శుభ ఫలితాలు వస్తాయో జ్యోతిష్యులు సూచించిన సూచనలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో అక్వేరియం లేదా నీటికి సంబంధించిన ఏదైనా వస్తువులను లేదా ఏదైనా షో పీస్‌లను ఉంచవద్దని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. అయితే అక్వేరియంను సహజ కాంతిలో అంటే సూర్య రశ్మి తగిలే విధంగా ఉంచడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఎరుపు, నలుపు రంగుల చేపలను ఇంట్లో ఉంచడం చాలా శ్రేయస్కరం. అదే సమయంలో అక్వేరియం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

ఇంటిలో ఏర్పాటు చేసుకున్న అక్వేరియం పెట్టె దిశను ( చేపలను ఉంచడానికి సరైన దిశ ) ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అయితే కొంతమంది రోజూ శుభ్రం చేయడానికి సమయం దొరకదు. అటువంటి వారు శుక్రవారం రోజున ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆర్థిక ఒత్తిడిని అరికట్టవచ్చు. మరోవైపు అక్వేరియం, దీనిని పెట్టె ప్రదేశం శుభ్రంగా ఉంచకపోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుంది, ఫలితంగా అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

పడకగదిలో అక్వేరియం ఉంచవద్దు

ఎంత అందంగా ఉంది అనిపించినా సరే అక్వేరియాన్ని పడకగదిలో పెట్టుకోరాదు. బెడ్ రూమ్ లో అక్వేరియం పెట్టుకోవడం వలన వైవాహిక జీవితంలో సమస్యలకు ఆహ్వానం పలికినట్లే.. అదే సమయంలో వంట గదిలో కూడా అక్వేరియం ఉంచవద్దు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వంటగదిలో అక్వేరియం పెట్టుకోవడం వలన దురదృష్టాన్ని తెస్తుంది. చేపట్టిన పనులు ఎప్పటికీ పూర్తీ అవకుండా వాయిదా పడుతూ ఉంటాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు