Vastu Shastra: కోపాన్ని ప్రేరేపించే ఈ ‘రంగు’ను ఇంట్లో నుంచి ఇప్పుడే తీసేయండి..!
Vastu Shastra: ప్రతి వ్యక్తి మరొకరికి భిన్నంగా ఉంటారు. కొందరు స్వతహాగా ప్రశాంతంగా ఉంటారు. మరికొందరికి కోపంగా ఉంటారు. ఈ కోపానికి కూడా అనేక కారణాలు..
Vastu Shastra: ప్రతి వ్యక్తి మరొకరికి భిన్నంగా ఉంటారు. కొందరు స్వతహాగా ప్రశాంతంగా ఉంటారు. మరికొందరికి కోపంగా ఉంటారు. ఈ కోపానికి కూడా అనేక కారణాలు ఉంటాయని, ముఖ్యంగా వాస్తు పరిస్థితులు ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు వాస్తు పండితులు. దీనికి వాస్తు శాస్త్రంలో నివారణలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం అనేది వ్యక్తి జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి ప్రకృతి నియమాలను ఉపయోగించే పురాతన భారతీయ అభ్యాసం. ప్రసిద్ధ ఆధ్యాత్మిక, మానసిక వైద్యుడు, టారో మెంటర్, న్యూమరాలజిస్ట్, వాస్తు నిపుణుడు డాక్టర్ మధు కొటియా.. వాస్తును ఉపయోగించి కోపాన్ని ఎలా నియంత్రించాలనే దానిపై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో ఎరుపు రంగును నివారించాలి.. ఎరుపు రంగుకు, కోపానికి సంబంధం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే ఇంట్లో ఎరుపు రంగు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వీలైనంత వరకు గోడలు, గృహోపకరణాలపై ఎరుపు రంగు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఎరుపు రంగు కోపాన్ని ప్రేరేపిస్తుంది. దీనికి బదులుగా ప్రశాంత చిత్తాన్ని కలిగించే.. నీలి రంగు, లేత ఆకురంగులను వేయాలి. బెడ్ షీట్‌లకు పాస్టెల్ రంగులను వేయాలి.
ఫర్నిచర్ ప్లేస్మెంట.. ఇంట్లో ఫర్నీచర్ పెట్టే ప్లేస్ కూడా చాలా ముఖ్యం. ఫర్నీచర్‌ను ఏర్పాటు చేసే ప్లేస్ కూడా కోపాన్ని ప్రేరేపిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఫర్నీచర్ పెట్టే ప్లేసుల్లో.. మురికి లేకుండా చూసుకోవాలి. ఇది మానసిక స్థితి మెరుగుపరుస్తుంది.
గోడపై అద్దం.. గుర్తుంచుకోవలసిన మూడవ విషయం ఏమిటంటే మీ ఇంటిలో అద్దాలను పెట్టే స్థలం కూడా చాలా ముఖ్యం. సరైన ప్లేస్‌లో అద్దం ఏర్పాటు చేస్తే.. కోపాన్ని తొలగించడంలో సహాయపడుతంది. వ్యక్తికి నిజమైన రంగులను చూసుకునే అవకాశం అద్దం కల్పిస్తుంది. అందుకే.. అద్దంలో ఆ రంగులను చూడటం వలన కూడా ప్రభావం ఉంటుంది.
మీ ఇంట్లో లైటింగ్ సిస్టమ్.. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంట్లో లైటింగ్ సిస్టమ్. ఇంటి అంతటా లైటింగ్ ఏర్పాటు చేయాలి. కోపాన్ని చెదరగొట్టడంలో లైటింగ్ ప్రభావవంతంగా ఉంటుంది.
బెడ్ దగ్గర క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్.. మంచం, బెడ్ దగ్గర క్వార్ట్జ్ క్రిస్టల్‌ను ఉంచాలి. ఇది కోపాన్ని గ్రహిస్తుంది. మానసిక ప్రశాంతత, ఓర్పు, సహనాన్ని ఇస్తుంది. ఈ స్ఫటికాలను ఉపయోగించి శాంతియుత వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఇవి కోపాన్ని నియంత్రించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
(గమనిక: దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. నిర్దిష్ట సలహా కోసం నిపుణుడిని సంప్రదించాలి. ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని మత గ్రంధాలు, వాస్తు శాస్త్రం ప్రకారం పబ్లిష్ చేయడం జరిగింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..