ఇంటిని, పరిశరాలను శుభ్రంగా చేసుకోవడానికి చీపురు మనం ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. అవును వాస్తవానికి చీపురిని ఆఫీసు, ఇల్లు లేదా దుకాణం, రోడ్లు ఇలా అనేక ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే హిందూ మతంలో ఈ చీపురికి అత్యంత ప్రాధాన్యత ఉంది. చీపురిని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. అయితే చీపురు ఉపయోగించిన తర్వాత ఎక్కడ బడితే అక్కడ ఎలా బడితే అలా పెట్టడం శాస్త్ర విరుద్ధమని పెద్దలు చెబుతారు. అంతేకాదు చీపురిని ఉపయోగించిన తరవాత కొన్ని నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రం పేర్కొంది. చీపురు కదా అంటూ ఆ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సభ్యులపై ఆగ్రహం కలిగి ఉంటుందట.
అదేవిధంగా ఎవరైనా ఆర్థిక సంక్షోభంలో ఉంటే చీపురు మంచి పరిష్కారం అని అంటున్నారు. ఇందుకు సంబంధించిన నివారణలను అనుసరిస్తే ఆర్ధిక సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఇంట్లో సుఖ సంపదలు నెలకొంటాయి. నిజానికి చీపురు ఇంటిని శుభ్రపరిచే సాధనంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు సహాయంతో ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను మరియు దురదృష్టాలను తొలగించవచ్చు. చీపురులోని శక్తి మీకు, మీ కుటుంబానికి అదృష్టాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఎలాగో తెలుసుకుందాం..
గురువారం ఇంటికి కొత్త చీపురుని కొని తీసుకుని రండి. ఈ రోజు చీపురు కొనడం మంచిది. అంతేకాదు చీపురు ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది.. ఆరోగ్యంగా ఉంచుతుంది.
మీరు లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించాలనుకుంటే జ్యోతిష్యంలో ఇందుకు పరిష్కారాన్ని సూచించింది. గురువారం ఒక్క చిన్న బంగారు చీపురుని తీసుకుని దానిని పూజా మందిరంలో కొన్ని రోజులు ఉంచి పూజించండి. అనంతరం ఆ బంగారు చీపురిని ఇంట్లో భద్రంగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ ఉంటుంది.
ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటే.. ఆ ఇంటిని గురువారం చీపురుతో శుభ్రం చేసి .. తర్వాత నీటితో శుభ్రంగా కడగండి. అనంతరం ఇంట్లోని అన్ని గదుల్లో గంగాజలం చల్లండి. ఇలా చేయడం వలన ఇంట్లోవారురోగాలబారిన పడరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)