Vastu Tips: శుక్రవారం సాయంత్ర వేళ ఈ పని చేయండి.. లక్ష్మీ దేవి అనుగ్రహంతో మీ లైఫే మారిపోతుంది..

ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రజలు ప్రతి రోజూ పూజలు చేయడం, ఉపవాసం ఉంటారు. దీంతోపాటు పలు చర్యలు కూడా తీసుకుంటారు. అయితే, శుక్రవారం నాడు సూర్యాస్తమయం సమయంలో కొన్ని పనులు చేయడం ద్వారా మంచి జరుగుతుందని వాస్తు, జ్యోతిస్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం కొన్ని పనులు చేయాలి..

Vastu Tips: శుక్రవారం సాయంత్ర వేళ ఈ పని చేయండి.. లక్ష్మీ దేవి అనుగ్రహంతో మీ లైఫే మారిపోతుంది..
Goddess Laxmi Devi

Updated on: Aug 04, 2023 | 2:11 PM

ఇంట్లో ఆనందం, శాంతి, ఆర్థిక స్థితి బాగుండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అయితే, వీటిని వాస్తు నియమాలు, కొన్ని నెగెటివ్ పరిస్థితులు ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రజలు ప్రతి రోజూ పూజలు చేయడం, ఉపవాసం ఉంటారు. దీంతోపాటు పలు చర్యలు కూడా తీసుకుంటారు. అయితే, శుక్రవారం నాడు సూర్యాస్తమయం సమయంలో కొన్ని పనులు చేయడం ద్వారా మంచి జరుగుతుందని వాస్తు, జ్యోతిస్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం కొన్ని పనులు చేయాలి సూచిస్తున్నారు.

లక్ష్మీదేవిని సంపదలు అందించే దేవతగా కొలుస్తారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి శుక్రవారం పవిత్రమైనదిగా పేర్కొంటారు. ఇంట్లో ఐశ్యర్యం, కుటుంబం ఆనందం, శాంతితో ఉండాలంటే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడంతో పాటు.. సాయంత్రం వేళ ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలని సూచిస్తున్నారు పండితులు. వీటిని ఆచరించడం వలన అన్ని సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. మరి ఆ పనులు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం

శుక్రవారం సూర్యాస్తమయం తర్వాత ఈ పరిహారం చేయండి..

1. శుక్రవారం సూర్యాస్తమయం తరువాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో వస్తుంది. తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

2. శుక్రవారం నాడు సూర్యాస్తమయం అయిన వెంటనే ఏడు దీపాలతో దీపం వెలిగించి ఈశాన్య మూలలో ఉంచాలి. అలాగే, దీపానికి చిటికెడు కుంకుమ, పువ్వు సమర్పించాలి. శుక్రవారం రోజున ఇలా చేయడం వల్ల సంపద, ఆస్తిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

3. శుక్రవారం సాయంత్రం కుటుంబ సమేతంగా లక్ష్మి దేవికి హారతి పట్టాలి. అలాగే అమ్మవారికి తెల్లటి స్వీట్లు, ఖీర్ నైవేద్యంగా పెట్టాలి. దీంతో లక్ష్మిదేవి సంతోషించి, ఆశీర్వాదం అందిస్తుంది.

4. శుక్రవారం రోజున రుణం ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చేయొద్దు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఏమీ అప్పుగా ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చేయొద్దు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తి అప్పుల భారం పెరుగుతుంది. సూర్యాస్తమయం తర్వాత మీకు ఏదైనా అవసరమైతే.. డబ్బు చెల్లించి మాత్రమే కొనుగోలు చేయాలి.

5. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఏ మూలన చీకటి లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సూర్యుడు అస్తమించిన వెంటనే, ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం, పూజ గది, వంటగది, హాల్‌లో లైట్లు ఆన్ చేసి ఉంచాలి. లేకపోతే ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

గమనిక: ఇది ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని, జ్యోతిస్య, వాస్తు పండితులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..