Vastu Tips for Directions: సనాతన హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రముఖ స్థానం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులను పెట్టే విషయంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను, కట్టడాలను ఉంచడానికి నిర్ణయించబడిన దిక్కులనే ఉపయోగించాలి. లేకపోతే ఆ ఇంట్లోని వారిలో విబేధాలు, ఆర్థికారోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. ముఖ్యంగా వాస్తు దోషాలుగా మారి ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తాయి. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏ వస్తువు ఉండాలలో ఇప్పుడే తెలుసుకుందాం..
ఉత్తర దిక్కు: వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కు సంపద, వృత్తికి తగిన ప్రాంతం. అందువల్ల ఇది ప్రవేశ ద్వారం, పడకగది, గది, తోట, వాకిలి, యార్డ్, బాల్కనీకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ దిశలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా ఉత్తమంగా ఉంటుంది.
దక్షిణ దిక్కు: ఈ దిశ కీర్తికి రాజ్యం వంటిదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఆ కారణంగా మాస్టర్ బెడ్‌రూమ్, సీఈఓ ఆఫీస్, ఎంటర్టైన్మెంట్ రూమ్‌కు ఇది మంచి ప్రాంతమని పేర్కొనవచ్చు.
పశ్చిమ దిక్కు: కుటుంబంలోనివారికి శక్తినిచ్చే ప్రాంతం పశ్చిమం. ఈ ప్రాంతాన్ని భోజన స్థలం కోసం ఉపయోగించవచ్చు. ఇంకా పడమటి వైపున ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు పెట్టుకోవడానికి మంచి ప్రదేశం.
తూర్పు దిక్కు: ప్రాణం ఇచ్చే సూర్యుడి పాలనలో తూర్పు దిక్కు ఉంటుంది. ఆ కారణంగానే చాలా మంది దీన్ని ప్రవేశించడానికి గొప్ప దిశగా చెబుతుంటారు. పైగా తూర్పు దిక్కు నుంచి ఉదయం వేళలో వచ్చే సూర్యకాంతి మీకు ఆరోగ్యాన్నిస్తుంది. అందువల్ల ఈ దిశలో కిటికీలు, తలుపులు, బాల్కనీలు, తోటలు ఉండటం ముఖ్యం. లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, ఫ్యామిలీ లాంజ్ కోసం కూడా ఈ దిక్కు అనువైనది.
ఈశాన్య దిక్కు: ఈశాన్యం మనశ్శాంతిని కలిగి ఉండే ప్రదేశం. ఈ దిశలో ధ్యానం లేదా ప్రార్థన గదిని ఏర్పాటు చేయవచ్చు. ఫ్యామిలీ లాంజ్ లేదా యోగా రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
వాయువ్య దిక్కు: వాయువ్య ప్రాంతం గాలికి ప్రధాన భాగం. ఎలివేటర్లు, రిఫ్రిజిరేటర్లు, మరుగుదొడ్లు, గెస్ట్ రూమ్ వంటివాటిని ఈ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు.
నైరుతి దిక్కు: కుటుంబ సభ్యలకు బలాన్నిచ్చే ప్రాంతం నైరుతి. ఈ ప్రదేశంలో ఇంట్లోని బరువైన వస్తువులను పెట్టుకోవచ్చు.
ఆగ్నేయ దిక్కు: ఆగ్నేయం ఇంటి యజమానుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ దిశలో వంటగది, ఆఫీసు క్యాంటీన్ లేదా ఎలక్ట్రిక్ బోర్డ్ వంటివాటిని పెట్టుకోవచ్చు. ఇంకా ఆగ్నేయ దిశను క్రియేటివ్ వర్క్స్ కోసం కూడా ఉపయోగించవచ్చు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..