Kitchen Vastu Tips: ఈ రెండు గిన్నెలు వంట గదిలో ఎప్పుడూ బోర్లించకూడదు.. ఎందుకంటే..
Kitchen Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంట్లో ప్రతి వస్తువును ఉంచడానికి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. గదుల నిర్మాణం మొదలు, తలుపులు, దర్వాజాల ఏర్పాటు, బెడ్ రూమ్, బెడ్స్, బీరువా వంటి వాటిని వాస్తు ప్రకారమే ఉంచాలి. అదేవిధంగా, వంటగదిలో పాత్రలను ఉంచడానికి కొన్ని వాస్తు నియమాలు కూడా ప్రస్తావించడం జరిగింది. వాస్తు విషయంలో వీటిని తప్పకుండా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. మనం వంటగదిలో వంట పాత్రలను వినియోగించిన తరువాత.. క్లీన్ చేసి బోర్లా పెడతాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం..
Kitchen Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంట్లో ప్రతి వస్తువును ఉంచడానికి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. గదుల నిర్మాణం మొదలు, తలుపులు, దర్వాజాల ఏర్పాటు, బెడ్ రూమ్, బెడ్స్, బీరువా వంటి వాటిని వాస్తు ప్రకారమే ఉంచాలి. అదేవిధంగా, వంటగదిలో పాత్రలను ఉంచడానికి కొన్ని వాస్తు నియమాలు కూడా ప్రస్తావించడం జరిగింది. వాస్తు విషయంలో వీటిని తప్పకుండా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. మనం వంటగదిలో వంట పాత్రలను వినియోగించిన తరువాత.. క్లీన్ చేసి బోర్లా పెడతాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని పాత్రలను తలక్రిందులుగా ఉంచడం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయి. దీని కారణంగా ఒక వ్యక్తి, కుటుంబం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మరి వేటిని బోర్లా పెట్టకూడదు? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు దోషం రావచ్చు..
పాన్ రోటీ తయారీకి ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, పాన్ ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచకూడదు. ఇది ఇంట్లో వాస్తు దోషాలను కలిగిస్తుంది. దాని కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
ఇది ప్రతికూలతను పెంచుతుంది..
కడాయిని కూరగాయలు వండడానికి లేదా ఏదైనా వేయించడానికి ఉపయోగిస్తారు. కడాయిని కూడా తలక్రిందులుగా ఉంచకూడదని వాస్తు శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఒకవేళ దీనిని బోర్లా పెడితే.. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరగడం మొదలవుతుంది.
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి..
అంతేకాకుండా, పాన్, కడాయిని ఉపయోగించిన తర్వాత, వాటిని ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు. వాటిని ఉపయోగించిన వెంటనే కడిగి శుభ్రంగా ఉంచాలని వాస్తు శాస్త్రంలో కూడా పేర్కొనడం జరిగింది.
ఈ దిశలో ఉంచండి..
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇత్తడి, రాగి, ఉక్కు, ఇతర లోహాలతో చేసిన పాత్రలను ఎల్లప్పుడూ వంటగదికి పశ్చిమ దిశలో ఉంచాలి. మీ ఇంట్లో ఈ వాస్తు నియమాలు పాటిస్తే చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..