Vaikuntha Ekadashi: 2025లో మొదటి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? ఉపవాస విరమణ సమయం ప్రాముఖ్యత ఎప్పుడంటే

హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మిదేవిలను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజా శుభ సమయం ఎప్పుడు? ఉవాస విరమణ సమయం తెలుసుకుందాం..

Vaikuntha Ekadashi: 2025లో మొదటి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? ఉపవాస విరమణ సమయం ప్రాముఖ్యత ఎప్పుడంటే
Vaikuntha Ekadashi 2025

Updated on: Jan 02, 2025 | 8:39 AM

సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి తిథిలు ఉంటాయి. హిందూ మతంలో ప్రతి ఏకాదశి తిథికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం చేయడం శుభ ప్రదం అని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాశం చేసి వ్యక్తి విష్ణులోకంలో స్థానం పొందుతాడు. అలాగే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. పురాణ గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ లోక ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి వ్రతం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుందాం.

2025లో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశిని మార్గశిర మాసంలోని కానీ  పుష్య మాసంలో గానీ వచ్చే శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి (11వ రోజు) రోజున జరుపుకుంటారు. ఈ నేపధ్యంలో 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి 9, గురువారం మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది శుక్రవారం జనవరి 10 ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు.

వైకుంఠ ఏకాదశి ఉపవాసం విరమణ సమయం

వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జనవరి 11వ తేదీ శనివారం ఉదయం 7:15 నుంచి 8:21 వరకు ఏకాదశి ఉపవాసం విరమణ కు శుభ సమయం ఉంటుంది. శుభ ముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత

వైకుంఠ ఏకాదశి ఉపవాసం మార్గశిర మాసంలోని కానీ  పుష్య మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి, పౌష పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం, విష్ణువు, లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.