అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది. గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌తో సహా మూడు అంతస్తులుగా విభజించారు. ఈ అంతస్తులలో ప్రతి ఒక్కటి ఆలయ ప్రాంగణం యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది, మొదటి, రెండవ మరియు మూడవ అంతస్తులలో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
ఆలయంలోని ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగుల ఎత్తులో ఉండే విధంగా నిర్మిస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, మొదటి అంతస్తులో 132 , రెండవ అంతస్తులో 34 స్తంభాలు ఉన్నాయి. మొత్తం ఆలయంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఉంటాయి. రామ మందిరంలోని వివిధ అంతస్తుల్లో వేర్వేరు నిర్మాణాలను నిర్మిస్తున్నారు. అయోధ్యలోని అద్భుతమైన రామ మందిరంలో ఏ అంతస్తులో ఏమి నిర్మిస్తున్నారో తెలుసుకుందాం.
గ్రౌండ్ ఫ్లోర్ లో గర్భగుడి
దశాబ్దాల పోరాటం తర్వాత ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుపుకుంటుంది. జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయి. ఆలయ గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. ఈ అంతస్తులో మొత్తం 14 తలుపులు, నాలుగు ప్రవేశ ద్వారాలున్నాయి. ఈ గర్భ గుడిలో బాల రాముడు కొలువు దీరి భక్తులతో పూజలను అందుకోనున్నారు. ఆలయంలో 5 మంటపాలు ఉంటాయి
స్తంభాలు , గోడలపై దేవుళ్ళ, దేవతల విగ్రహాలు చెక్కబడ్డాయి. సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది. ఆలయానికి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
రెండవ ,మూడవ అంతస్తులలో దర్బార్, ఇతర పుణ్యక్షేత్రాలు
ఆలయం మొదటి అంతస్తులో శ్రీరాముని ఆస్థానం కూడా ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన శిల్పాలతో అలంకరించనున్నారు. వెండి, రత్నాలతో అలంకరించబడిన సింహాసనం కూడా ఈ అంతస్తులో ఉంటుంది. ముగ్గురు శిల్పులు తయారు చేసిన బాల రాముడి విగ్రహాలలో మిగలిన రెండు విగ్రహాలను మొదటి రెండవ అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు శ్రీరాముని ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతల ఆలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు