Lord Shiva Temple: నేటికీ సైన్స్ చేధించని రహస్యం ఈ ఆలయం.. చీపురు సమర్పిస్తే చర్మ వ్యాధులు నయం..

|

Aug 14, 2024 | 9:20 AM

ఈ ఆలయంలో ఉన్న శివయ్య పవిత్ర శివలింగం గురించి అనేక కథలున్నాయి. ఈ శివలింగం మూలాధారం పాతాళంలో ఉంది. అందుకే ఈ ఆలయాన్ని పాతాలేశ్వర మహాదేవ ఆలయం అని పిలుస్తారు. శివలింగం లోతును పరీక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేసినా పవిత్రమైన శివలింగాన్ని ఎవరూ తరలించలేకపోయారని చెబుతారు.

Lord Shiva Temple: నేటికీ సైన్స్ చేధించని రహస్యం ఈ ఆలయం.. చీపురు సమర్పిస్తే చర్మ వ్యాధులు నయం..
Pataleshwar Mahadev Temple
Follow us on

భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక శివాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలకు దాని సొంత కథ ఉంటుంది. కొన్ని దేవాలయాలలో జరిగే అద్భుతాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు కొన్ని రహస్య దేవాలయాలు ఉన్నాయి. వాటి రహస్యాలు ఇప్పటి వరకు ఎవరూ వెల్లడించలేదు. భగవంతుని ఆశీర్వాదం కోసం, దుఃఖాల నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా దేవాలయాలను సందర్శిస్తారు అంతేకాదు దేవుడికి పూలు, పండ్లు మొదలైన అనేక రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. బంగారం, వెండి, నగదు వంటివి కానుకలుగా సమర్పిస్తారు. . అయితే కొన్ని ఆలయాల్లో వింత ఆచారాలు ఉన్నాయి. భక్తులు ఆలయంలో చీపురు సమర్పించడం ద్వారా వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోని మొరాదాబాద్‌లోని బహ్జోయికి చెందిన సదత్‌బరి అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. దీనిని పాతాలేశ్వర్ శివాలయం అని పిలుస్తారు. ఈ ఆలయంలో సోమవారం, శివరాత్రి, శ్రావణ మాసంలో శివుడికి చీపురు సమర్పించడానికి చాలా క్యూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పాతాళేశ్వరుని పేరు కథ

ఈ ఆలయంలో ఉన్న శివయ్య పవిత్ర శివలింగం గురించి అనేక కథలున్నాయి. ఈ శివలింగం మూలాధారం పాతాళంలో ఉంది. అందుకే ఈ ఆలయాన్ని పాతాలేశ్వర మహాదేవ ఆలయం అని పిలుస్తారు. శివలింగం లోతును పరీక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేసినా పవిత్రమైన శివలింగాన్ని ఎవరూ తరలించలేకపోయారని చెబుతారు.

పాలతో చీపురు సమర్పించే సంప్రదాయం

పాతాళేశ్వరాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శివునికి పాలతో చీపురు సమర్పించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ ఆలయానికి చీపుర్లు సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ ఆలయంలో శివునికి చీపురు సమర్పించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని ఇక్కడి స్థానికులు నమ్ముతారు.

సంప్రదాయం ఎలా మొదలైంది?

శతాబ్దాల క్రితం భిఖారి దాస్ అనే వ్యాపారవేత్త ఉండేవాడని.. అతను చర్మవ్యాధితో బాధపడుతూ ఉండేవాడట. ఎన్నిమార్లు చికిత్స చేయించుకున్నా కోలుకోలేదు. ఒకసారి భిఖారి దాస్ ఎక్కడికో వెళ్తూ.. దారిలో దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఆశ్రమానికి నీళ్లు తాగడానికి వెళ్లాడు. అక్కడ చీపురుని అనుకోకుండా తట్టుకున్నాడు. చీపురు తాకిన వెంటనే భిఖారి దాస్ చర్మవ్యాధి నయమైందని స్థానికులు చెబుతారు.

ఆలయాన్ని నిర్మించిన వ్యాపారవేత్త

చర్మవ్యాధి నుండి ఉపశమనం పొందిన తరువాత భిఖారి దాస్ ఆశ్రమంలో నివసిస్తున్న సాధువులకు డబ్బులను ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే వ్యాపారి కోరికను విన్న సాధువులు డబ్బులను తీసుకోవడానికి నిరాకరించారు. ఈ డబ్బుతో అక్కడ గుడి కట్టించమని చెప్పారు. ఆ తర్వాత వ్యాపారవేత్త అక్కడ శివాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయంలో చీపురు సమర్పించే సంప్రదాయం మొదలైంది.

సంవత్సరానికి రెండుసార్లు జాతర జరుగుతుంది
పాతాలేశ్వర మహాదేవ శివాలయం 1902లో నిర్మించబడింది. ఈ ఆలయంలో సంవత్సరానికి రెండు సార్లు జాతర కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయ సముదాయానికి సమీపంలో, పశుపతినాథ ఆలయాన్ని పోలి ఉండే మరొక ఆలయం కూడా నిర్మించారు. ఇందులో ఐదు వందల శివలింగాలు ఉన్నాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు