Mangalagiri: పానకాల స్వామి ఆలయంలో బయల్పడుతున్న అద్భుతాలు.. వెలుగులోకి కోనేరులో ఒక సొరంగం

|

Jun 18, 2023 | 1:49 PM

పానకాల స్వామి ఆలయంలోని చీకటి కోనేరులో ఇప్పటికే అరుదైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ  వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం, వినాయక రాతి విగ్రహం బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా పెద్ద కోనేరులో మరో అద్భుతాన్ని కనుగొన్నారు ఆలయాధికారులు. ఈ కోనేరులో ఒక సొరంగం బయటపడింది. 

Mangalagiri: పానకాల స్వామి ఆలయంలో బయల్పడుతున్న అద్భుతాలు.. వెలుగులోకి కోనేరులో ఒక సొరంగం
,panakala Swamy Temple
Follow us on

ఆధ్యాత్మితకు నెలవైన ఆలయాల్లో అనేక అద్భుతాలకు , వింతలు, విశేషాలకు నెలవు. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో అనేక ఆలయాలున్నాయి. వీటిల్లో కొన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పూజ్యనీయంగా ప్రసిద్ధిగాంచితే.. మరికొన్నింటికి రాజులు, రాజపోషకులు, జమీందార్లు అభివృద్ధి చేయడంతో మహామహిమానిత్వ క్షేత్రాలుగా నేటికీ విలసిల్లుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రంగా భక్తులతో పూజలను అందుకుంటున్న క్షేత్రం గుంటూరు జిల్లాలోని మంగళగిరి. ఇక్కడ కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు పానకాల స్వామివారుగా ప్రసిద్ధిగాంచారు. ఈ ప్రదేశం అనేక వింతలు, విశేషాలున్నాయి. గత కొంతకాలంగా  మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొంత కాలంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆలయం ఎదురుగా ఉన్న చీకటి కోనేటిని పునరుద్ధరించి భక్తులకు  అందుబాటులోకి తీసుకొచ్చారు.

పానకాల స్వామి ఆలయంలోని చీకటి కోనేరులో ఇప్పటికే అరుదైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ  వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం, వినాయక రాతి విగ్రహం బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా పెద్ద కోనేరులో మరో అద్భుతాన్ని కనుగొన్నారు ఆలయాధికారులు. ఈ కోనేరులో ఒక సొరంగం బయటపడింది.  దాదాపు 5 అడుగులు వెడల్పున్న ఓ సొరంగాన్ని ఆలయ అధికారులు గుర్తించారు. ఈ సొరంగం పూర్తిగా బురదతో కూడిన నీటితో నిండి ఉంది. ఈ సొరంగం చేబ్రోలు బ్రహ్మగుడి వరకూ ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు దేవాదాయశాఖ అధికారులు. కాగా ఈ సొరంగంలోని బురదను, నీటిని తొలగిస్తున్నారు. పూర్తి స్థాయిలో బురదను తొలగించిన అనంతరం సొరంగం లోపల ఏముంది.. ఎక్కడ వరకూ వెళ్ళవచ్చు అన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పానకాల స్వామి ఆలయ సిబ్బంది వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..