Tuesday Tips: మంగళవారం భజరంగబలిని ఇలా పూజించండి .. కోరిన కోర్కెలు నెరవేరతాయి..

|

Jul 11, 2023 | 10:29 AM

శివుడు, పార్వతితో పాటు హనుమంతుడికి ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి మంగళవారం ఉదయం,  సాయంత్రం సుందర్‌కాండ, బజరంగ బాన్ ను పఠించండి. పవన పుత్రుడు హనుమంతుడు శివుని రుద్ర అవతారం అని కూడా అంటారు. అటువంటి పరిస్థితిలో శ్రావణ మంగళవారం బజరంగబలిని పూజించే ప్రత్యేక మార్గాలను తెలుసుకుందాం.. 

Tuesday Tips: మంగళవారం భజరంగబలిని ఇలా పూజించండి .. కోరిన కోర్కెలు నెరవేరతాయి..
శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం సూర్యాస్తమయం తర్వాత హనుమంతుడిని పూజించండి. హనుమంతదేవుని పూజలో దీపం వెలిగించవచ్చు. అయితే ఆ దీపంలో నల్ల నువ్వుల నూనె ఉపయోగించండి.
Follow us on

మంగళవారం సంకట మోచన హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున హనుమంతుడిని ఆరాధించడం ద్వారా అశుభాలు తొలగి.. శుభకార్యాలు జరుగుతాయని..  హనుమంతుని అనుగ్రహంతో భక్తులు సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వసిస్తారు. పవన పుత్రుడు హనుమంతుడు శివుని రుద్ర అవతారం అని కూడా అంటారు. అటువంటి పరిస్థితిలో శ్రావణ మంగళవారం బజరంగబలిని పూజించే ప్రత్యేక మార్గాలను తెలుసుకుందాం..

  1. శివుడు, పార్వతితో పాటు హనుమంతుడికి ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి మంగళవారం ఉదయం,  సాయంత్రం సుందర్‌కాండ, బజరంగ బాన్ ను పఠించండి.
  2. 11 రావి ఆకులను తీసుకుని వాటిని శుభ్రం చేసి వాటిపై కుంకుంతో శ్రీరామ అని రాయండి. దీని తర్వాత దానితో ఒక మాల తయారు చేసి హనుమంతుడికి ధరింపజేయండి. ఇలా చేయడం వలన చెడు తొలగి మంచి జరిగేలా చేస్తుంది.
  3. నూనెలో సింధూరం కలిపి హనుమంతుడికి సమర్పించండి. దీనితో పాటు 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి.
  4. మంగళవారం నాడు హనుమంతుని విగ్రహం నుండి సింధూరం తీసుకొని సీతామాత పాదాల వద్ద పూయండి.  నిర్మలమైన హృదయంతో పూజించండి. ఇలా చేయడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఈ రోజు తమలపాకులపై బజరంగబలికి బెల్లం , పప్పును సమర్పించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు, తులసి మాలతో ‘ఓం హన్ హనుమతే నమః’ అనే ఈ మంత్రాన్ని ఐదుసార్లు జపించండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).