TTD: తిరుమల శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ అలర్ట్.. ఆ సర్టిఫికెట్ ఉంటేనే దర్శనం చేసుకునే ఛాన్స్..

తిరుమల శ్రీవారి భ‌క్తుల‌ను టీటీడీ అలర్ట్ చేసింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమలకు వచ్చే భక్తులు..

TTD: తిరుమల శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ అలర్ట్.. ఆ సర్టిఫికెట్ ఉంటేనే దర్శనం చేసుకునే ఛాన్స్..
Tirumala Pti 1640594654

Updated on: Jan 25, 2022 | 5:10 PM

COVID-19 Vaccination Certificate: తిరుమల శ్రీవారి భ‌క్తుల‌ను టీటీడీ అలర్ట్ చేసింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని సూచించింది. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు.. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇటు టీటీడీ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేస్తోంది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి: Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..

UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్‌పూర్ ఎమ్మెల్యే..