TSRTC: శబరిమల భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. తక్కువ ఛార్జీలతో అద్దె బస్సులు.. పూర్తి వివరాలివే..

|

Nov 15, 2021 | 9:00 AM

అయ్యప్ప స్వాములు, శబరిమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తక్కువ ఛార్జీలతో శబరిమలకు స్పెషల్‌ బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది..

TSRTC: శబరిమల భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. తక్కువ ఛార్జీలతో అద్దె బస్సులు.. పూర్తి వివరాలివే..
Follow us on

అయ్యప్ప స్వాములు, శబరిమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తక్కువ ఛార్జీలతో శబరిమలకు స్పెషల్‌ బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను అధికారిక ట్విట్టర్‌లో పంచుకుంది. ఇందులో భాగంగా
1. 36 సీట్ల సూపర్‌ లగ్జరీ బస్సులను కిలోమీటర్‌కు రూ. 48.96 చొప్పున
2. 40 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులను కిలోమీటర్‌ రూ. 47.20 చొప్పున
3. 48 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులను రూ.56.64 చొప్పున
4. 49 సీట్లు ఉన్న ఎక్స్‌ప్రెస్‌ బస్స్ఉలను రూ. 52.43 చొప్పున అద్దెకు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. పైన తెలిపిన బస్సులన్నింటికీ గంటకు రూ. 300 చొప్పున వెయిటింగ్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

నిజామాబాద్‌ డిపో పరిధిలోనూ..
కాగా భక్తుల కోసం బస్సులో ప్రత్యేకంగా వంట మనిషి, ఇద్దరు మనికంట స్వాములు, ఒక అటెండర్‌ ప్రత్యేకంగా ఉంటారు. వీరే భక్తులకు కావాల్సిన భోజన, వసతి సదుపాయాలన్నీ చూసుకుంటారు. ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు భక్తులు కూడా ఈ బస్సులను బుక్‌ చేసుకోవచ్చు. ఆర్టీసీలో బాగా నైపుణ్యం, అనుభవమున్న డ్రైవర్లనే పంపుతారు. నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని డిపోలలో కూడా శబరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు, భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

Also Read:

Viral Video: న్యాయం కోసం వచ్చిన వృద్దుడిపై ఎస్ఐ దాడి.. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాష్టీకం..!

Weather: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్‌.. ఏపీ, తెలంగాణలో మరికొద్ది రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్!

Doctor Prabhu Kumar: నేషనల్ యంగ్ లీడర్ అవార్డును అందుకున్న తెలంగాణ డాక్టర్.. ప్రభు కుమార్‌కు అభినందనల వెల్లువ..