Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్తున్నారా.. అయితే ఈ ఆంక్షలు పాటించాల్సిందే

మహా శివరాత్రి సందర్భంగా గుంటూరు(Guntur) జిల్లాలో జరిగే కోటప్పకొండ(Kotappakonda) తిరుణాళ్లు ఎంతో పేరుగాంచాయి. దేశంలోని ఏ శైవ క్షేత్రంలో లేని విధంగా ఇక్కడ ప్రభల వేడుక....

శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్తున్నారా.. అయితే ఈ ఆంక్షలు పాటించాల్సిందే
Kotappakonda
Follow us
Ganesh Mudavath

| Edited By: Anil kumar poka

Updated on: Feb 28, 2022 | 6:39 PM

మహా శివరాత్రి సందర్భంగా గుంటూరు(Guntur) జిల్లాలో జరిగే కోటప్పకొండ(Kotappakonda) తిరుణాళ్లు ఎంతో పేరుగాంచాయి. దేశంలోని ఏ శైవ క్షేత్రంలో లేని విధంగా ఇక్కడ ప్రభల వేడుక కన్నులపండువగా జరుగుతుంది. రంగు రంగుల విద్యుత్ దీపాలతో కొలువైన ప్రభలు భక్తిభావం పెంచుతాయి. తమ గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ.. ఎన్నో వ్యయప్రయాసలతో భక్తులు(Devotees) ప్రభలను తయారు చేస్తారు. ఒక్కో ప్రభ ఏర్పాటు చేయటానికి పదిహేను లక్షలు రూపాయలు ఖర్చవుతుంది. అదే విధంగా ఒకే ఇంటి పేరు గల కుటుంబాలన్నీ కలిసి ఒకే ప్రభగా కొండకు తరలివస్తాయి. శివరాత్రి రోజు త్రికూటేశ్వరస్వామి సన్నిధిలో జాగారం చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తాయి. పండుగ రోజున ఆలయ పరిసరాలు శివ నామస్మరణతో మార్మోగుతాయి.

నరసరావుపేట నుంచి నుంచి వచ్చే భక్తులు ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మార్గంలో కొండకు చేరుకుని, నాగిరెడ్డి గెస్ట్‌హౌస్‌ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకోవాలి. నరసరావుపేట నుంచి యల్లమంద మార్గంలో వచ్చే వారు జనరల్‌ పార్కింగ్‌లో వాహనాలు నిలుపాలి. వినుకొండ నుంచి వచ్చే భక్తులు ఘాట్‌రోడ్డు సమీపంలోని జనరల్‌ పార్కింగ్‌లో వాహనాలు నిలిపి, ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాలి. యల్లమంద మార్గంలో తిరుగు ప్రయాణానికి అనుమతి లేదని, కొండకావూరు, పమిడిమర్రు మీదుగా కర్నూలు- గుంటూరు ప్రధాన రహదారిపైకి వెళ్లాలి. చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే వీఐపీ భక్తులు యూటీ జంక్షన్‌ నుంచి క్రషర్స్‌ మార్గంలో వీఐపీ పార్కింగ్‌ స్థలానికి చేరుకోవాలి. అక్కడ వాహనాలు నిలిపి ప్రత్యేక బస్సుల్లో కొండపైకి వెళ్లాలి. Also Read

Russia Ukraine War: రష్యా అమ్ములపొదిలో హైడ్రోజన్‌ బాంబ్.. అది ఏదైనా మెట్రో నగరం మీద పడితే..

Girl Struck in Metro Grill: మెట్రోస్టేషన్​ గ్రిల్​లో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన జవాను.. వీడియో వైరల్..

Viral Video: తగ్గేదెలే.. నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు..! వీడియో చూస్తే మతిపోవాల్సిందే..