- Telugu News Photo Gallery Spiritual photos Maha shivratri 2022 lord shiva special blessings will be on these 5 zodiac signs on mahashivratri in telugu
Maha Shivratri 2022: మహాశివరాత్రి రోజు ఈ రాశులపై శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందట.. అవేంటంటే..
మహాశివరాత్రి.. హిందూవులకు అత్యంత ప్రత్యేకమైన రోజు. ఉపవాసం.. జాగరణ ఉండి శివుడిని పూజిస్తుంటారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ శివరాత్రి రోజున ఈ రాశులపై శివుడి అనుగ్రహం ఉంటుందట. అవెంటో తెలుసుకుందామా.
Updated on: Feb 28, 2022 | 1:56 PM

మేషరాశి.. ఈ సంవత్సరం మాహాశివరాత్రి మేషరాశి వారికి ఎంతో శుభప్రదం. వీరు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివుడికి ఆభిషేయం చేయడం వలన వీరు కోరికలు నేరవేరతాయి. అంతేకాకుండా.. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

మిథున రాశి.. శివరాత్రి రోజున వీరు శుభవార్త వింటారు. అలాగే శివుడి ప్రత్యేక అనుగ్రహం వీరిపై ఉంటుంది. ఈ రాశివారి వైవాహిక జీవితంలో మంచి మార్పులు వస్తాయి. సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేయడానికి మీరు శివుడిని పూజించాలి.

వృశ్చిక రాశి.. ఈరాశివారు.. శివరాత్రి రోజున శివుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. జీవితంలో మానసిక ప్రశాంతత.. సమతుల్యతను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అనేక అవకాశాలు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధిస్తారు.

మకర రాశి.. వీరికి మాహాశివరాత్రి రోజున శనిదేవుడు.. మహాశివుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ శివరాత్రి రోజున వీరు బేలపత్రం, గంగాజలం, ఆవుపాలతో శివుడిని పూజించడం వలన ఐశ్వర్యం, సంతోషం పెరుగుతాయి.

కుంభ రాశి.. ఈ రాశివారికి శివరాత్రి రోజున శని దేవుడు, మహ శివుడి ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగంలో మరింత విజయం సాధిస్తారు. అంతేకాకుండా... శివుడిని ఆరాధించడం వలన ఆదాయం పెరుగుతుంది. ఈరోజున ఉపవాసం ఉండి.. శివుడిని పూజించాలి.




