ఆధ్యాత్మికత, పవిత్రతకు ఆధునికతను జోడించి రేపటి తిరుమల అభివృద్ధి కోసం అడుగులు వేస్తోంది టీటీడీ. దీనికోసం తిరుమల విజన్ – 2047తో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతామంటోంది. ఆధునిక టౌన్ ప్లానింగ్‌ని పాటిస్తూనే, తిరుమల పవిత్రత పెంపొందించేందుకు శాశ్వత వ్యూహాల అమలు కోసం నడుం బిగించింది. దీనిలో భాగంగా వారసత్వ కట్టడాల పరిరక్షణ, పర్యావరణ నిర్వహణకు ప్రాముఖ్యత కల్పిస్తామంటోంది.
తిరుమల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తోంది టీటీడీ. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేస్తోంది. భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగు పరచడంతో, తిరుమలను ప్రపంచ స్థాయి రోల్ మోడల్‌గా మార్చే యత్నానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రముఖ అధ్యాత్మిక నగరాలు…అయోధ్య, కాశీ తరహాలో తిరుమలను డెవలప్ చేయనుంది.
తిరుమల విజన్-2047ని విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. గతంలో ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరిగాయని, తిరుమలను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలోని అన్ని ఆలయాలకు రోల్ మోడల్‌గా ఉండేలా….తిరుమలను అభివృద్ధి చేస్తామన్నారు ఈవో శ్యామలరావు. దీనికోసం టీటీడీలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించి, తిరునగరికి మరిన్ని సొబగులు అద్దనుంది టీటీడీ.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..