కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వరస సెలవులు వస్తే తిరుమల కొండ భక్త సంద్రంగా మారుతుంది. ఇక విద్యార్థుల పరీక్షలు ముగిసి వేసవి సెలవులు వస్తే చాలు నారాయణుడి దర్శనానికి వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో మే నెల కు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
అంతేకాదు వివిధ ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 19వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల అంటే రెండు రోజుల పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ సేవల కోసం నమోదు చేసుకున్నవారు లక్కీ డీప్ టికెట్ల మంజూరుని మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్నారు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు తగిన డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవల కోసం అంటే.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
ఈ నెల 23న ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.
ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను రిలీజ్ చేయనుంది.
మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గం. ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.
మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ రిలీజ్ చేయనుంది.
ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, అదే రోజున మధ్యాహ్నం 12 గం. నవనీత సేవ, మధ్యాహ్నం 2 గం. పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..