Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వచ్చే ఫిబ్రవరిలో దర్శనం కోటా విడుదల అప్పుడే..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలను ప్రకటించింది. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే పలు రకాల దర్శనాలు, గదుల కోటా వివరాలపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. TTD వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరుతోంది.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వచ్చే ఫిబ్రవరిలో దర్శనం కోటా విడుదల అప్పుడే..!
Ttd Announcement

Edited By: Balaraju Goud

Updated on: Nov 17, 2025 | 11:30 AM

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలను ప్రకటించింది. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే పలు రకాల దర్శనాలు, గదుల కోటా వివరాలపై టీటీడీ స్పష్టత ఇచ్చింది.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుండి 22 వరకు మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

ఇక కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను నవంబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. 21న వర్చువల్ సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. 24న శ్రీవాణి దర్శన కోటా విడుదల చేయనుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. ఇక వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను ప్రకటించింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను నవంబర్ 24వ తేదీన మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. నవంబర్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయబోతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఇక తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలంటోంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..