TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇవాళే డిసెంబర్ నెల సర్వ దర్శనం టోకెన్ల జారీ.. సమయం ఎప్పుడంటే..

| Edited By: Rajeev Rayala

Nov 27, 2021 | 8:38 AM

TTD Darshan Tickets: వైకుంఠాధిపతి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు తిరుపతి తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) శుభవార్త చెప్పింది.

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇవాళే డిసెంబర్ నెల సర్వ దర్శనం టోకెన్ల జారీ.. సమయం ఎప్పుడంటే..
Tirumala
Follow us on

TTD Darshan Tickets: వైకుంఠాధిపతి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు తిరుపతి తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) శుభవార్త చెప్పింది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం గత కొంతకాలంగా.. ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్ల కోటాను రిలీజ్ చేస్తూ వస్తో్న్న టీటీడీ.. డిసెంబర్‌ నెలకు సంబంధించి సర్వ దర్శనం టోకెన్ల కోటాను జారీ చేయనుంది. ఈ నెల 27వ తేదీన అంటే ఇవాళ ఉదయం 9 గంటలకు విడుదల సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా ప్రకటించింది.

సర్వదర్శనం టిక్కెట్లతో పాటు భక్తులకు కొండపై ఉండేందుకు వసతి గదుల బుకింగ్‌ను ఈనెల 28న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ నెల కోటాను ఆదివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో గత కొంత కాలంగా టీటీడీ ఆన్‌లైన్ లోనే దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

కాగా, తిరుమలేశుడి దర్శనానికి సంబంధించి 300రూపాయల ప్రత్యేక దర్శనం, టైమ్‌స్లాట్‌ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. గత నెల నుంచి సర్వ దర్శనం, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటాను పెంచింది. 300రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను రోజుకు 12వేలు, సర్వదర్శనం టోకెన్ల కోటాను రోజుకు 10లకు పెంచింది టీటీడీ బోర్డు. ఈనెల, వచ్చే నెలలో ఇదే కోటాలో టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Also read:

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు