Tirumala brahmotsavam 2025: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..ఇవాళ్టి విశేషం ఏంటంటే..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఇవాళ(బుధవారం) శ్రీదేవి భూదేవి సమేతంగా మహారథంపై విహరించారు శ్రీమలయప్ప స్వామివారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవాన్ని తిలకిస్తే.. జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంటే, మళ్లీ పుట్టడం మళ్లీ చావడం వంటి జన్మాంతర పాపాల నుంచి విముక్తి కలుగుతుందనే నమ్మకం. ఈ సాయంత్రం..

Tirumala brahmotsavam 2025: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..ఇవాళ్టి విశేషం ఏంటంటే..
Tirumala Brahmotsavam

Updated on: Oct 01, 2025 | 7:50 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఇవాళ(బుధవారం) శ్రీదేవి భూదేవి సమేతంగా మహారథంపై విహరించారు శ్రీమలయప్ప స్వామివారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవాన్ని తిలకిస్తే.. జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంటే, మళ్లీ పుట్టడం మళ్లీ చావడం వంటి జన్మాంతర పాపాల నుంచి విముక్తి కలుగుతుందనే నమ్మకం. ఈ సాయంత్రం కల్కి అవతారంలో అశ్వవాహనంపై విహరించనున్నారు శ్రీనివాసుడు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ సాయంత్రం జరిగే అశ్వవాహన విహారంతో వాహన సేవలు పూర్తవుతాయి. రేపు(గురువారం) ఉదయం పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం.. సాయంత్రం జరిగే ధ్వజావరోహణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.