AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పెద్ద శేష వాహనంపై శ్రీనివాసుడు.. గోవిందా నామాస్మరణతో మారుమ్రోగిన మాడ వీధులు

వచ్చే నెల 2వ తేదీ వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. తొమ్మిదో రోజు చేపట్టే ధ్వజావరోహణంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 9రోజులపాటు శ్రీవారు.. ఉదయం, సాయంత్రం సమయాల్లో వేర్వేరు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే... తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా శ్రీవారు పెదశేషవాహనంపై ఊరేగారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పెద్ద శేష వాహనంపై శ్రీనివాసుడు.. గోవిందా నామాస్మరణతో మారుమ్రోగిన మాడ వీధులు
Tirumala Brahmotsavam
Jyothi Gadda
|

Updated on: Sep 24, 2025 | 10:04 PM

Share

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పెద్దశేష వాహనసేవలో పాల్గొన్నారు శ్రీవారు. భూదేవి-శ్రీదేవి సమేత మలయప్పస్వామిగా.. పెదశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో శ్రీవారు ఊరేగారు. బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన భక్తులు.. శ్రీవారిని కనులారా చూసి తరించారు. మరోవైపు.. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా.. 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాల్లో అన్నదానానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇక.. వచ్చే నెల 2వ తేదీ వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. తొమ్మిదో రోజు చేపట్టే ధ్వజావరోహణంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 9రోజులపాటు శ్రీవారు.. ఉదయం, సాయంత్రం సమయాల్లో వేర్వేరు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే… తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా శ్రీవారు పెదశేషవాహనంపై ఊరేగారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?