
విమర్శలకు భయపడేవాడిని కాదని నేను నాస్తికుడిననే విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానమన్నారు
టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో మానవ వికాస వేదిక నిర్వహించిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. సొంత అన్న భుమాన్ రాసిన మూడు తరాల మనిషి భూమన్ పుస్తకాన్ని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తో పాటు పలువురు సమక్షంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. రాడికల్ ఉద్యమంలో విప్లవ రచయిత సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసి ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం కూడా గడిపిన భూమన్ ను పలువురు సత్కరించి సన్మానించారు.
అధ్యాపకుడిగా రచయితగా సామాజికవేత్తగా నేటి తరానికి భూమన్ స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు. టీటీడీ చైర్మన్ గా భూమన పై వస్తున్న ఆరోపణలకు పుస్తక ఆవిష్కరణ సభలో గట్టిగా బదులిచ్చిన కరుణాకర్ రెడ్డి
17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినన్నారు. దేవుడి దయతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానన్నారు.
తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది తానే నన్నారు. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ తానే నన్న భూమన దళితవాడలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది కూడా తానే నన్నారు. తనకి క్రిస్టియన్ ముద్రవేసి నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానమన్నారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదు.. పోరాటాల నుండి పైకి వచ్చిన వాడినన్నారు. ఇలాంటి వాటికి భయపడనన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..