
Tholi Ekadasi 2021: నేడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారు జామునే పుణ్యస్నానాలు ఆచరించి దేవుళ్లను దర్శించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆలయాలను సందర్శిస్తున్నారు. కాగా, తొలి ఏకాదశిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు చాలా మంది వచ్చారు. కాగా, తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ వేద పండితులు. మరోవైపు తెలంగాణలోని ప్రముఖ వైష్టవ క్షేత్రమైన యాదాద్రి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల రాక నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదిలాఉంటే.. నిర్మల జిల్లాలోని సుప్రసిద్ధం పుణ్యంక్షేత్రంలోనూ తొలి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రతి మంగళవారం వేకువజామున సరస్వతి అమ్మవారికి తేనెతో అభిషేకం నిర్వహించే కార్యక్రమానికి ఆలయ అర్చకులు.. వేద పండితులు శ్రీకారం చుట్టారు. తోగుట పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి సూచనల మేరకు ప్రతి మంగళవారం ఉదయం అమ్మవారికి తేనెతో విశేష అభిషేకము నిర్వహించి ఆ తేనెను అభిషేకం అనంతరం విద్యార్థులకు, చిన్నారులకు ప్రసాదంగా అందించారు. ఈ తేనె ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మాటలు రాని చిన్న పిల్లలు అనర్గళంగా మాట్లాడగలుగుతారని, చిన్నారులకు విద్యా బుద్ది, మంచి మేధస్సు ప్రాప్తి చెందుతుందని ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ మహారాజ్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగ పరచుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
Also read:
IND vs SL, 2nd ODI Preview: వన్డే సిరీస్‌పై టీమిండియా గురి.. పరువు కోసం శ్రీలంక పోరాటం!