AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tholi Ekadashi: తొలి ఏకాదశి రోజున కనకధారా స్తోత్రం పారాయణం చేయండి.. జీవితంలో దారిద్ర్యం దరి చేరదు

ఆషాడ మాసం శుక్ల పక్షం ఏకాదశి తిధిని తొలి ఏకాదశి అని అంటారు. ఏడాది పొడుగునా వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో తొలి ఏకాదశి రోజు నుంచే సంవత్సరారంభంగా పరిగణించేవారట. అంతటి విశిష్టత ఉన్న ఈ రోజున ఆదిశంకరులు రచించిన కనకధార స్తోత్రాన్ని చదవడం అత్యంత ఫలవంతం అని విశ్వాసం. అంతేకాదు ఈ రోజు నుంచి చాతుర్మాస సమయం మొదలవుతుంది.

Tholi Ekadashi: తొలి ఏకాదశి రోజున కనకధారా స్తోత్రం పారాయణం చేయండి.. జీవితంలో దారిద్ర్యం దరి చేరదు
Tholi Ekadashi
Surya Kala
|

Updated on: Jul 02, 2025 | 7:08 AM

Share

హిందూ మతంలో తొలి ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని ప్రతి సంవత్సరం ఆషాడ మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 6న జరుపుకోనున్నారు. హిందువుల విశ్వాసాల ప్రకారం ప్రపంచ రక్షకుడైన శ్రీ మహా విష్ణువు తొలి ఏకాదశి నుంచి విశ్రాంతి తీసుకుంటాడు. యోగ నిద్రలోకి వెళ్తాడు. నాలుగు నెలల తరువాత కార్తీక మాసంలోని దేవుతానీ ఏకాదశి రోజున మేల్కొంటాడు . ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. తొలి ఏకాదశి చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది.తొలి ఏకాదశి నాడు కనకధార స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించాలి. ఈ రోజున తొలి ఏకాదశి నాడు కనకధార స్తోత్రాన్ని చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

కనకధార స్తోత్ర పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ?

సనాతన ధర్మం నమ్మకం ప్రకారం.. ఏకాదశి రోజున కనకధార స్తోత్రాన్ని పఠించడం వల్ల అపారమైన ఆనందం , శ్రేయస్సు లభిస్తాయి. దీనిని పఠించడం ద్వారా వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలు చాలా త్వరగా తొలగిపోతాయని నమ్మకం. దీనిని ప్రతిరోజూ పఠించడం ద్వారా, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని, శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

కనకధారా స్తోత్రం

వందే వందారు మందారమిందిరానందకందలమ్ । అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥

ఇవి కూడా చదవండి

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం- ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ । ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి । కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ । మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన । మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోఽపి । ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥

ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే । దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా- మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే । దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి । సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై । శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥

నమోఽస్తు నాళీకనిభాననాయై నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై । నమోఽస్తు సోమామృతసోదరాయై నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥

నమోఽస్తు హేమాంబుజపీఠికాయై నమోఽస్తు భూమండలనాయికాయై । నమోఽస్తు దేవాదిదయాపరాయై నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై । నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥

నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై । నమోఽస్తు దేవాదిభిరర్చితాయై నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥

సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి । త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥ 16 ॥

యత్కటాక్షసముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః । సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥

సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే । భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥

దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ । ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ-గృహిణీం-అమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥

కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః । అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ । గుణాధికా గురుతర-భాగ్య-భాగినో [భాగినహ్] భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥

సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ । త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ ।

కనకధార స్తోత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి ?

విశ్వాసం ప్రకారం కనకధార స్తోత్రాన్ని ఎన్నిసార్లు అయినా పఠించవచ్చు. సాధారణంగా రోజుకు ఒకసారి లేదా 108 సార్లు పఠించడం మంచిది. ఏకాదశి, శుక్రవారం, పౌర్ణమి రోజున కనకధార స్తోత్రాన్ని పఠించడం వల్ల విశేష ఫలాలు లభిస్తాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.